జాతీయ పోటీలకు ఆనంది
కమాన్‌పూర్: మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల కు ఎంపికైంది. ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో అండర్–17 బాలికల 400 మీటర్ల పరుగుపందెంలో అత్యంత ప్రతిభ కనబర్చింది. ఈనెల 19 నుంచి 23 వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లో నిర్వహించే జాతీయస్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీల్లో మనరాష్ట్రం తరఫున పాల్గొనుంది. ఆనంది జా తీయ పోటీల్లో బంగారు పతకం సాధించాలని క్రీడాకారులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
కబడ్డీ పోటీలకు ఎంపిక
పెద్దపల్లిరూరల్: అప్పన్నపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు అడప శ్రీవర్షి త, కొలకాని సంయుక్త రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. సుల్తానాబాద్‌లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్రజట్టులో చో టు సాధించారు. ఈనెల 5, 6వ తేదీల్లో హైద రాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే వర్షిత, సంయుక్తను సర్పంచ్ ఆరె సంతోష్, ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం, పీడీ వేల్పుల సురేందర్‌తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు అభినందించారు.
7లోగా నమోదు చేయాలి
పెద్దపల్లి: ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, పరి పాలనా రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను ఈ నెల 7వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కో శాధికారి రమేశ్ ఆదేశించారు. వివిధ శాఖల అ ధికారులకు ఈ–హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ–శాంక్షన్ మాడ్యూళ్ల వినియోగంపై కలెక్టరేట్‌లో బుధవారం అవగాహన కల్పించారు. డిజిటల్ విధానంతో పరిపాలనలో పారదర్శకత పెరగడంతోపాటు కార్యాలయాల పనులు వేగవంతమవుతాయన్నారు. డిసెంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ శాఖల్లో పూర్తిస్థాయిలో డిజిటల్ రికార్డుల నిర్వహణ అమలు చేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు గంగయ్య, సురేశ్, కలెక్టరేట్ ఏవో ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
క్రేన్ ఆపరేటర్‌పై దాడికి నిరసన
గోదావరిఖని: పైలాన్ తొలగింపు సందర్భంగా క్రేన్ ఆపరేటర్‌పై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌దాడి చేయడాన్ని నిరసిస్తూ లారీ డ్రైవర్లు బుధవారం స్థానిక ప్రధాన చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. లారీ అసోసియేషన్ అధ్యక్షుడు కుందూరి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
క్వింటాల్ పత్తి రూ.8,636


