గ్రిడ్‌కు సౌర విద్యుత్‌ అనుసంధానం | - | Sakshi
Sakshi News home page

గ్రిడ్‌కు సౌర విద్యుత్‌ అనుసంధానం

Nov 4 2026 11:52 PM | Updated on Nov 4 2026 11:52 PM

● సొసైటీల ఆధ్వర్యంలో ‘సోలార్‌’ పవర్‌ ● రాష్ట్రంలోనే జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

పెద్దపల్లిరూరల్‌/పెద్దపల్లి: రాఘవాపూర్‌ గ్రామంలో అప్పన్నపేట సొసైటీ ఏర్పాటు చేసిన సోలార్‌ పవర్‌ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను బుధవారం గ్రిడ్‌కు అనుసంధానించే ప్రక్రియను కలెక్టర్‌ కోయ శ్రీహర్ష బటన్‌ ఆన్‌చేసి ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నాలుగు సంఘాల ఆధ్వర్యంలో సోలార్‌ పవర్‌ప్లాంట్లను ఏర్పా టు చేసిన ఘనత జిల్లాకే దక్కిందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. అప్పన్నపేట సొసైటీ రాఘవాపూర్‌లో ఏర్పాటు చేసిన ఒక మెగావాట్‌ విద్యుత్‌ సింక్రజైనేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. నాలుగు సోలార్‌ పవర్‌ ప్లాంట్ల నుంచి నాలుగు మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయడం హర్షణీయమన్నారు. ఇకనుంచి రోజూ విద్యుత్‌ ఉత్పత్తి నిరాటంకంగా సాగుతుందని అన్నారు. సోలార్‌ ప్లాంట్లను త్వరలోనే అధికారికంగా ప్రారంభించేందుకు సన్నా హా లు చేస్తున్నామని కలెక్టర్‌ వివరించారు. డీసీవో శ్రీమాల, ట్రాన్స్‌కో ఎస్‌ఈ గంగాధర్‌, రెడ్‌కో ప్రతినిధి మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖాతాదారులకు ఓడీ సౌకర్యం

పెద్దపల్లి: జిల్లాలోని ప్రతీ బ్యాంకు ఖాతాదారుకు ఓవర్‌ డ్రాఫ్ట్‌(ఓడీ) సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష బ్యాంకర్లను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీతో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన డీసీసీ, డీఎల్‌ఆర్సీ సమావేశంలో బ్యాంకుల పనితీరు, రుణ ప్రణాళిక, బీమా పథకాల అమలుపై సమీక్షించారు. రూపే, డెబిట్‌ కార్డులు పొందిన వారంతా యాక్టివేట్‌ చేసుకుని ప్రమాద బీమా ప్రయోజనాలు పొందేలా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement