పెద్దపల్లికి కొత్త హంగులు | - | Sakshi
Sakshi News home page

పెద్దపల్లికి కొత్త హంగులు

Nov 4 2026 11:52 PM | Updated on Nov 4 2026 11:52 PM

● అన్నివిధాలా అభివృద్ధి చేస్తా ● ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రం హోదాకు తగ్గట్టు కొత్తహంగులు అద్దుతామన్నారు. మున్సిపల్‌లోని 5, 9, 10, 11 వార్డుల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్యతో కలిసి బుధవారం ప్రారంభించారు. పలు పద్దుల కింద మంజూరైన రూ.77కోట్లతో చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయని విప్‌ తెలిపారు. ప్రధాన కూరగాయల మార్కెట్‌ను రూ.7కోట్లతో ఆధునికీకరిస్తామని, పనులు త్వరలోనే మొదలవుతాయని అన్నారు. ఇండోర్‌ స్టేడియం పనులు పూర్తయ్యాయని వివరించారు. ఆర్టీసీ బస్సు డిపో, బైపాస్‌, ప్రభుత్వ ఆస్పత్రి తదితర అభివృద్ధి పనులు పూర్తవుతున్నాయని వివరించారు. కమిషనర్‌ వెంకటేశ్‌, కౌన్సిలర్లు గుజ్జుల కుమార్‌, నదీం, పూదరి అనూష తదితరులు పాల్గొన్నారు.

దళారులకు ధాన్యం విక్రయించొద్దు

ఓదెల: రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వ విప్‌ విజయరమణరావు అన్నారు. ఓదెల మండలంలోని ఉప్పరపల్లె, గోపరపల్లె, హరిపురం, పిట్టలపల్లె, కొలనూర్‌, తండా, నాంసానిపల్లెలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ రంగానికి పది గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నాయకులు పిట్టల రవికుమార్‌, పల్లె కనుకయ్య, గ్యారవేని విజయ, కొప్పుల పద్మ, గుగులోతు నిమ్మనాయక్‌, గుగులోతు లింగేశ్‌, ప్రభాకర్‌, ఆళ్ల సుమన్‌రెడ్డి, గోపు నారాయణరెడ్డి, బైరి రవిగౌడ్‌, పాకాల కరుణాకర్‌రెడ్డి, దొడ్డె స్వామి, ఏవో భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement