నాకున్న ఐదెకరాల్లో ఈసారి వరి పంట సాగుచేసిన. పెద్దపల్లి మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చి వడ్లు ఆరబెట్టిన. ఒక్కసారిగా కురిసిన వానకు వడ్లన్నీ తడిసినయ్. అప్పటికీ తడవకుండా టార్పాలిన్లు కప్పినా ఫలితం లేకపోయింది. రేపు కూడా వానలు ఉన్నయంటుండ్రు. ధాన్యం ఎప్పుడు ఆరుతుందో? ఎప్పుడు తూకం వేస్తరో?
– మిట్టపల్లి కనుకయ్య, రైతు, దస్తగిరిపల్లి
పత్తి తడిచింది
నేను పండించిన పత్తిని తొలి సారిగా అమ్మేందుకు ఐదు క్వింటాళ్లను పెద్దపల్లి మార్కెట్‌కు తెచ్చిన. మార్కెట్‌లో తూకం వేసి ధర నిర్ణయించే సమయంలో అకస్మాత్తుగా వర్షం కురిసింది. వాననీళ్లతో పత్తి సంచులు తడిసినయి. అమ్ముకుందామని మార్కెట్‌కు వచ్చినా అవస్థలు తప్పడం లేదు.
– నాంపల్లి, రైతు, చీకురాయి
చర్యలు తీసుకుంటున్నాం
అకాల వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచిస్తున్నాం. మా సిబ్బంది టార్పాలిన్లు ఇచ్చేందుకు అందుబాటులో ఉన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకునేలా సహకారం అందిస్తున్నాం. గురువారం వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాం.
– ప్రవీణ్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి


