కేసీఆర్‌ను కలిసిన మహా సైకిల్‌యాత్రికులు | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను కలిసిన మహా సైకిల్‌యాత్రికులు

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

పెద్దపల్లి/గోదావరిఖని: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను చాటుతూ మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు చేపట్టిన 400 కిలోమీటర్ల మహా సైకిల్‌ యాత్ర విజయవంతంగా ముగిసింది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సూచనల మేరకు బీఆర్‌ఎస్‌ నాయకులు ఉప్పు రాజ్‌కుమార్‌, సరేశ్‌ యాత్ర పూర్తిచేశారు. యాత్ర ముగింపు అనంతరం బుధవారం ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. నాయకులతో కేసీఆర్‌ సుమారు మూడు గంటలపాటు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా భోజనం, తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని చెందిన బొడ్డు రవీందర్‌, మేకల నవీన్‌, పారుపల్లి అనిల్‌కుమార్‌, మంచినీళ్ల రాకేశ్‌, ముత్యం లక్ష్మణ్‌గౌడ్‌, అమ్ము కుమార్‌(ముత్తారం), పెద్దపల్లి ప్రాంతానికి చెందిన శ్రీధర్‌, సతీశ్‌గౌడ్‌, పూసాల రామకృష్ణ, శ్రీనివాస్‌, రవీందర్‌, కాశీపాక వాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement