ప్రేమతో ఎంపీ! | - | Sakshi
Sakshi News home page

ప్రేమతో ఎంపీ!

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 4 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
విగ్రహం విరిగింది
ఆకాశం ఎరుపెక్కింది
ప్రియమైన మంత్రి గారికి..

కూలీల సంఖ్య పెంచాలి

సుల్తానాబాద్‌రూరల్‌: ఉపాధిహామీ(వీబీ జీ రాంజీ)లో కూలీల సంఖ్య పెంచడంతోపాటు కొత్తవారికి జాబ్‌కార్డులు ఇవ్వాలని జెడ్పీ సీఈవో నరేందర్‌ సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. సిబ్బందితో సమావేశమయ్యారు. జిల్లాలో ఇంకుడుగుంతలు, పంట కుంటలు, నీటి కుంటలు నిర్మించుకునేవారికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరగతిన పరిష్కరంచాలని అన్నారు. ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఎంపీవో మౌనిక, పర్యవేక్షకుడు ఫక్రోద్దిన్‌, ఏపీవో మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ఆరుతడి పంటలు మేలు

కమాన్‌పూర్‌: యాసంగి సాగులో తక్కువ నీటి లభ్యతతో సాగయ్యే(ఆరుతడి)పంటలను సా గు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీ నివాస్‌ సూచించారు. గుండారం రైతు వేదికలో మంగళవారం రైతులతో సమావేశమయ్యారు. డీఏవో మాట్లాడుతూ ఎల్‌నీవో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగింటిపోవడంతో పంటలకు నీరు అందలేని పరిస్థితులు ఏర్పాడతాయన్నారు. విద్యుత్‌ సమస్య కూడా ఉంటుందని, వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడమే మేలని వివరించారు. మంథని ఏడీఏ అంజని, ఏవో రామకృష్ణ, ఏఈవో నవీన్‌ పాల్గొన్నారు.

పని విధానం నేర్చుకోవాలి

కమాన్‌పూర్‌: ఆదివరాహ మహిళా సమాఖ్య భవనంలో నిర్వహిస్తున్న కమాన్‌పూర్‌, మంథని మండలాల వీవోఏల శిక్షణ శిబిరాన్ని డీఆర్డీవో కాళిందిని మంగళవారం పరిశీలించారు. మహిళలను లక్షాధికారులను చేసే ఎన్‌ఆర్‌ఎల్‌ఎం డాటా ఎంట్రీ విధానం, కేవైసీ, సంఘాల ఆర్థిక లావాదేవీల గురించి సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ వీవోఏ డాటా ఎంట్రీ, పని విధానం, నేర్చుకోవాలని సూచించారు. ఏపీవో పద్మ, సీసీలు భిక్షపతి, మల్లయ్య, ఆపరేటర్‌ రమణి పాల్గొన్నారు.

మహిళా సాధికారతకు కృషి

జ్యోతినగర్‌: మహిళా సాధికారత, నైపుణ్యా భి వృద్ధి, స్వయం ఉపాధి కల్పించడమే రామగుండంలోని ఎన్టీపీసీ లక్ష్యమని దీప్తి మహిళా స మితి అధ్యక్షురాలు తజీన్‌ జావీద్‌ అన్నారు. ఎన్టీపీసీలోని మేడిపల్లి సెంటర్‌ సాయి సేవా సమితిలోని వొకేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో మూడు నెలల పాటు సీఎస్‌ఆర్‌ ఉచిత బ్యూ టిషియన్‌ కోర్సు శిక్షణ ఇచ్చారు. మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో శిక్షణ పొందిన వారికి ప్రశంసపత్రాలు అందజేసి మాట్లా డారు. మహిళలు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి సభ్యులు, సీఎస్‌ఆర్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

తీర్థయాత్రల పోస్టర్‌ ఆవిష్కరణ

గోదావరిఖనిటౌన్‌: ఆర్టీసీ బస్సు ప్రత్యేక యాత్ర ప్యాకేజీ వాల్‌పోస్టర్‌ను స్థానిక డీఎం కవిత మంగళవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ, శబరిమల, రామేశ్వరం– కన్యాకుమారి, వారణాసి– అయోధ్య, కర్ణాటక యాత్ర, 7 జ్యోతిర్లింగాలు, 2 శక్తి పీఠాలు, ఆంధ్రప్రదేశ్‌–ఒడిశా తదితర టూర్‌ ప్యాకేజీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భోజనం, వసతి ఖర్చులు భక్తులే భరించాల్సి ఉంటుందని తెలిపారు. బుకింగ్‌ కోసం డిపో కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు.

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లోకి అడుగుపెట్టగానే రైతు కుటుంబంలోని తల్లీకూతుల్లు ఎడ్లబండిపై ధాన్యం తీసుకొకొచ్చే విగ్రహంకనిపిస్తూ ఉంటుంది. తల్లీకూతుళ్ల చేతులు విరిగి వికారంగా కనిపిస్తున్నాయి. వాటిని మరమ్మతు చేయాల్సి ఉంది. – పెద్దపల్లిరూరల్‌

కమాన్‌పూర్‌: గుండారం రిజర్వాయర్‌ వద్ద ఆకాశం ఎర్రబడింది. నింగి, నేల, నీరు ఎరుపెక్కాయి. సమీపంలోని గుట్టపై అగ్నిపర్వతం బద్ధలై అగ్నికీలలు ఎగిసిపడినట్లు అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మంగళవారం సాయంత్రం కనువిందు చేసిందీ చిత్రం.

సాక్షి, పెద్దపల్లి:

పెద్దపల్లి కాంగ్రెస్‌ రాజకీయాల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మధ్య విభేదాలు క్రమంగా బయటపడతున్నాయనే చర్చ మొదలైంది. పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఎంపీ వంశీకృష్ణ చేస్తున్న వ్యాఖ్యలు, మంత్రి శ్రీధర్‌బాబుకు రాస్తున్న వరుస లేఖలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ కోసం ఏళ్లతరబడి పనిచేస్తున్న కార్యకర్తలు, దళిత, గిరిజన ప్రజాప్రతినిధులపై సస్పెన్షన్‌ వేటు వేయడాన్ని ఎంపీ తీవ్రంగా తప్పుబడుతున్నారు. అధికార యంత్రాంగం వ్యవహారశైలిపై అసంతృప్తి, కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం రాజకీయ వేడిని పెంచుతోంది. ‘లేఖల వెనుక ఉన్న రాజకీయ లెక్కలేంటి’ అనేదానిపై చర్చకు దారితీస్తోంది.

20 ఏళ్లుగా సేవ చేస్తే సస్పెన్షనా?

ఇటీవల మంథని నియోజకవర్గంలోని కొయ్యూరు లో విశాఖ చారిటబుల్‌ ట్రస్ట్‌ పేద విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు పంపిణీ చేసింది. ఎంపీ వంశీకృష్ణతో కలిసి పాల్గొన్న గిరిజన వార్డు సభ్యురాలు లకావత్‌ లక్ష్మి, ఉపసర్పంచ్‌ లకావత్‌ సవీందర్‌ను కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్‌ సస్పెండ్‌ చేయడంపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి శ్రీధర్‌బాబుకు లేఖ రాసిన ఎంపీ.. 20 ఏళ్లుగా కాంగ్రెస్‌ కోసం పనిచేస్తున్న గిరిజన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, పేద విద్యార్థులకు సేవ చేయడం పార్టీ వ్యతిరేక చర్య ఎలా అవుతుందని నిలదీశారు. మంత్రి ఆదేశాల మేరకే సస్పెన్షన్ల ఆరోపణలు వస్తున్నాయని లేఖలో ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతర్గత పోరు బహిర్గతమవుతోందా?

వాస్తవానికి రెండు లేఖల్లోనూ ఎంపీ వంశీకృష్ణ నేరుగా ప్రస్తావించిన అంశం పార్టీ అంతర్గత క్రమశిక్షణ, కార్యకర్తలకు న్యాయం చేయడమే అయినా.. వాటి వెనుక రాజకీయ సందేశం స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి ఆదేశాలపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావించడం, పార్టీ నిర్ణయాల్లో సమానత్వం ఉండాలని డిమాండ్‌ చేయడం ద్వారా ఎంపీ తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు జిల్లాలో అధికార యంత్రాంగంపై అసహనం, కలెక్టర్‌పై ఫైర్‌ కావడం చర్చనీయాంశమైంది. దీంతో ఎంపీ రాజకీయంగా దూకుడు పెంచుతున్నారా? లేక పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తూ తన వాదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అధిష్టానం జోక్యం చేసుకుంటుందా?

పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా.. నేతల మధ్య సమన్వయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన సమయంలో అంతర్గత విభేదాలు బయటపడితే క్యాడర్‌పై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ పార్టీ ఐక్యత గురించి ఎంపీ పదేపదే మాట్లాడుతుండటం గమనార్హం. అయితే, విభేదాలపై మంత్రి స్పందన ఏమిటి? సస్పెన్షన్లను ఉపసంహరిస్తారా? పార్టీ పెద్దలు సమస్య పరిష్కరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కార్యకర్తల సస్పెన్షన్లు.. మరోవైపు ఎమ్మెల్యేలపై చర్యల అంశం.. ఇంకోవైపు కలెక్టర్‌తో వివాదం.. మొత్తంగా రాజకీయాల్లో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వర్సెస్‌ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ లేఖల పరంపర ఎక్కడికి దారితీస్తుందో, కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.

క్వింటాల్‌ పత్తి రూ.8,669

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,669 ధర పలికింది. కనిష్టంగా రూ.8,000, సరాసరి రూ.8,554గా ధర నిర్ణయించినట్టు జిల్లా మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. పలు ప్రాంతాలనుంచి రైతులు తీసుకొచ్చిన 980 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్టు డీఎంవో పేర్కొన్నారు.

● పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు

● నాలుగేళ్లలో 305 మందికి నిర్ధారణ

● ఈ ఏడాది ఇప్పటివరకు 79 కేసులు

హస్తం పార్టీలో హీట్‌.. ఎంపీ వర్సెస్‌ మంత్రి

పెద్దపల్లి కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు!

లేఖాస్త్రాలతో ఎంపీ.. ఇరకాటంలో మంత్రి!

కార్యకర్తల సస్పెన్షన్‌పై అభ్యంతరం.. కలెక్టర్‌ తీరుపై అసంతృప్తి

అధికార యంత్రాంగంపైనా ఆగ్రహం

లేఖల రాజకీయం.. పార్టీ మార్పునకు సంకేతమా?

ఎంపీగా గెలిచిన నాటి నుంచి తన పరిధిలోని ఎమ్మెల్యేలతో సఖ్యత లేదనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఎంపీ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలోనే అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రోటోకాల్‌ పాటించడం లేదని కలెక్టర్‌పైనే విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కీలక మంత్రినే లక్ష్యంగా చేసుకుని లేఖలు రాస్తుండడంతో ఎంపీ వెనుక బలమైన నేతలు ఎవరైనా ఉన్నారా, లేక పార్టీ మారే ఆలోచన ఉందా? అనే చర్చ సాగుతోంది.

ఎమ్మెల్యేలకు ఒక న్యాయం.. కార్యకర్తలకు మరో న్యాయమా?

తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్‌ నిర్వహించిన ర్యాలీని ఆధారంగా చేసుకుని ఎంపీ మరోసారి వ్యంగ్యంగా లేఖాస్త్రం సంధించడం మరోసారి దుమారం లేపింది. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ సభకు గైర్హాజరైన ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవద్దని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఒకవైపు విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు పంపిణీ చేసినందుకు దళిత, గిరిజన ప్రజాప్రతినిధులపై సస్పెన్షన్‌ చర్యలు తీసుకోవడం, మరోవైపు ఢిల్లీ సభకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేల విషయంలో చర్యల అంశం తెరపైకి తీసుకొవచ్చి సరికొత్త వివాదానికి తెరతీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement