గతంలో కిలో సన్నబియ్యం రూ.60–70 దొరికేది. ఇప్పుడు రకం, బ్రాండ్‌ను బట్టి రూ.90–రూ.100 చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం ధరలు నిర్ణయించినట్లు ప్రకటించినా దుకాణాల్లో ఎక్కడా అమలు కావడం లేదు. నెలవారీ ఆదాయంలో ఎక్కువ మొత్తం బియ్యం కొనుగోలుకే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే కూరగాయలు, పప్పులు, నూనెల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ధరలు నిర్ణయించడంతో సరిపెట్టకుండా దుకాణాల్లో తనిఖీలు చేయాలి. నిర్ణయించిన ధరలకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలి.
– గాదాసు మధు, వినియోగదారుడు


