ఉత్తీర్ణత శాతం పెంపునకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉత్తీర్ణత శాతం పెంపునకు కృషి చేయాలి

Nov 3 2026 12:39 AM | Updated on Nov 3 2026 12:39 AM

మంథని: కళాశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించేందుకు అధ్యాపకులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి దాసరి కల్పన సూచించారు. సోమవారం మంథని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు పరిశీలించి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు అధ్యాపకులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నోటుపుస్తకాలను తనిఖీ చేసి వారి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఈ నెలాఖరులోగా సిలబస్‌ పూర్తి చేసి, డిసెంబర్‌ నుంచి పునశ్ఛరణ తరగతులు ప్రారంభించాలని సూచించారు. ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు యూనిఫాం, నోటుపుస్తకాలు, బ్యాగులు, బూట్లతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తోందని, డ్రాపౌట్ల సంఖ్య తగ్గించి హాజరు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారి విద్యాప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు. ప్రిన్సిపాల్‌ భూక్య బాలోజీ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

పారదర్శకంగా పనులు చేయించాలి

జూలపల్లి: గ్రామాల్లో వీబీజీరాంజీ పనులు పా రదర్శకంగా నిర్వహించి, కూలీలకు పని ది నాలు కల్పించాలని డీఆర్‌డీవో పీడీ కాళిందిని ఆదేశించారు. సోమవారం మండలంలోని వ డ్కాపూర్‌లో పనులు పరిశీలించి వివరాలు తె లుసుకున్నారు. అనంతరం జూలపల్లి వెలుగు సమాఖ్య కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సంఘాలకు రుణాలు, రికవరీ గురించి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఏపీఎం సుధాకర్‌, ఏపీవో సదానందం, సిబ్బంది ఉన్నారు.

అభివృద్ధి పనులపై కాంగ్రెస్‌ నిర్లక్ష్యం

రామగుండం: బీఆర్‌ఎస్‌ హయాంలో అంతర్గాం మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు సద్వినియోగం చేసుకోకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ అన్నారు. సోమవారం అంతర్గాం జంక్షన్‌లో చేపట్టిన నిరసన దీక్షలో మాట్లాడారు. గోదావరినదిపై రైల్వే వంతెన నిర్మాణానికి రూ.160 కోట్ల కేటాయింపు తదితర అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అంతర్గాంకు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే చర్యలను ఎండగట్టారు. తాము ప్రకటించిన డిమాండ్ల విషయమై ఎమ్మెల్యే స్పందించాలని లేకుంటే క్యాంపు ఆఫీసు ముట్టడికి పిలుపునిస్తామని పేర్కొన్నారు. బూడిద, ఇసుక అక్రమ రవాణాతో వచ్చే ఆదాయంతో ఎమ్మెల్యే ప్యాలెస్‌ తరహాలో ఇంటి నిర్మాణం చేపడుతున్నాడని వ్యాళ్ళ హరీశ్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్మిక నాయకుడు కౌశికహరి, మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మినారాయణ, మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ, విజయారెడ్డి, మట్ట లక్ష్మి, మురళీధర్‌రావు, కోల సంతోష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

చిరుజల్లులు.. అప్రమత్తమైన రైతులు

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలో సోమవారం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా, పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ల్లుతుందనే భయంతో అప్రమత్తమయ్యారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు పత్తి రైతులు సైతం వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చ వాతావరణం ఇలాగే మారుతూ ఉంటే పంట దిగుబడులు, నాణ్యతపై ప్రభావం పడుతుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement