గోదావరిఖని: రామగుండం నియోజకవర్గాన్ని వైద్య, విద్య, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. స్థానిక పవర్హౌజ్కాలనీలో సింగరేణి యాజమాన్యం ఆధునీకరించిన పార్కును సోమవారం ప్రారంభించారు. అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిన ప్రాంతాలను ఆహ్లాదం పంచే అందమైన పార్కులు, ప్లేగ్రౌండ్లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పార్కుల వద్ద తోటమాలీలు, సిబ్బంది విశ్రాంతి కోసం చిన్న గదులు, ప్రజల కోసం మరుగుదొడ్లుఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల్లో వాటాగా రూ.5,500 అందించడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ మాట్లాడుతూ, రూ.20 లక్షలతో పార్కులో మౌలిక వసతులు కల్పించేలా ఆధునీకరణ పూర్తి చేస్తామన్నారు. నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, అధికారుల సంఘం ప్రతినిధి క్రాంతికుమార్, నాయకులు మడ్డి మల్లయ్య, సదానందం, వడ్డేపల్లి శంకర్, కార్పొరేటర్ వేగోలపు రమాదేవి, దాసరి మౌనిక, ఫారెస్ట్ డీజీఎం కర్ణ, అధికారులు కాశి విశ్వేశ్వర్రావు, రెడ్డిమల్ల తిరుపతి, హనుమంతరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


