ఆందోళన కలిగిస్తున్న ఎయిడ్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఆందోళన కలిగిస్తున్న ఎయిడ్స్‌

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

పెద్దపల్లి: జిల్లాలో హెచ్‌ఐవీ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగేళ్లలో 305 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 2023లో 92 మందికి, 2024లో 67 మందికి, 2025లో 67 మందికి, 2026లో ఇప్పటివరకు 79 మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈఏడాది కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హెచ్‌ఐవీ నియంత్రణలో భాగంగా 2026 ఆగస్టు వరకు సాధారణ విభాగంలో 14,066 మందికి పరీక్షలు చేయగా 79 మందికి పాజిటివ్‌గా తేలింది. వారందరినీ ఏఆర్టీ చికిత్సకు అనుసంధానించారు. గర్భిణుల్లో 5,174 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి నిర్ధారణ అయి వారినీ ఏఆర్టీకి అనుసంధానించారు.

రామగుండంలో అత్యధికం

సాధారణ విభాగంలో రామగుండం ఏరియా ఆస్పత్రిలో 2,745 మందిని పరీక్షించగా 22 మందికి, పెద్దపల్లి సీహెచ్‌సీలో 3,244 మందిలో 18 మందికి, మంథని సీహెచ్‌సీలో 2,161 మందిలో ఐదుగురికి, ఎన్టీపీసీ టీబీ క్లినిక్‌లో 742 మందిలో ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది.

అవగాహనే కీలకం..

హెచ్‌ఐవీ అనేది వ్యాధి నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపే వైరస్‌. ముఖ్యంగా సీడీ–4 కణాలను దెబ్బతీస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఎయిడ్స్‌ దశకు చేరుకునే ప్రమాదం ఉంది. క్రమంతప్పకుండా ఏఆర్టీ మందులు వాడితే ఆరోగ్యంగా జీవించవచ్చు.

వ్యాప్తికి ప్రధాన కారణాలు

సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషిత రక్తం ఎక్కించడం, సూదులు, సిరంజీలను పంచుకోవడం, తల్లి నుంచి బిడ్డకు(గర్భం, ప్రసవం, తల్లి పాల ద్వారా) హెచ్‌ఐసీ వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, సరైన చికిత్సతో ముప్పు తగ్గించవచ్చు.

నియంత్రణలోనే ఉంది

వందరోజుల ప్రణాళికలో భాగంగా ప్రతీ పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రిలో ఉచిత పరీక్షలు చేస్తున్నాం. అనుమానం ఉంటే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.

– డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి,

జిల్లా ప్రోగ్రాం అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement