పైలాన్‌ తొలగింపు ఉద్రిక్తం | - | Sakshi
Sakshi News home page

పైలాన్‌ తొలగింపు ఉద్రిక్తం

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

గోదావరిఖని: బీఆర్‌ఎస్‌ హయాంలో అభివృద్ధికి గుర్తుగా స్థానిక కోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ తొలగింపు ఉద్రిక్తంగా మారింది. స్టీల్‌తో ఏర్పాటు చేసిన పైలాన్‌ను మున్సిపల్‌ అధికారులు గ్యాస్‌ కట్టర్‌తో కట్‌చేసి క్రేన్‌సాయంతో తొలగిస్తున్నారనే సమాచారంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, నాయకులు వ్యాళ్ల హరీశ్‌రెడ్డి, కౌశిక హరితోపాటు కార్పొరేటర్లు, నాయకులు క్రేన్‌ను అడ్డుకున్నారు. సుమారు 8గంటల పాటు బైఠాయించారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధికి గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను రాజకీయ కక్షతోనే తొలగించారని ఆరోపించారు. ఈ క్రమంలో కోరుకంటి చందర్‌.. క్రేన్‌ ఇంజిన్‌ను ఆఫ్‌ చే యాలని కోరినా ఆపరేటర్‌ వినలేదు. ఆగ్రహంతో ఊగిపోయిన చందర్‌.. క్రేన్‌ నుంచి బయటకు వచ్చి న ఆపరేటర్‌ను చితక బాదారు. మక్కాన్‌సింగ్‌ ఎమ్మెల్యేగా గెలిచాక చిరు వ్యాపారాలు, గుడులను కూల్చివేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ రమేశ్‌, సీఐలు ఇంద్రసేనారెడ్డి, కృష్ణప్రసాద్‌, ప్రసాద్‌రావు పోలీసు బలగాలతో అక్కడకు చేరుకుని కోరుకంటి చందర్‌, బీఆర్‌ఎస్‌ వ్యాళ్ల హరీశ్‌రెడ్డి, కౌశిక హరితోపాటు నాయకులను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. క్రేన్‌ ఆపరేటర్‌పై దాడిచేసినందుకు చందర్‌, నాయకులపై కేసు నమోదు చేశారు.

అభివృద్ధి ఆనవాళ్లు చెరిపేస్తే చూస్తూ ఊరుకోం

అభివృద్ధి ఆనవాళ్లు చెరిపి వేయాలని చూస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మంగళవారం హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రామగుండం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిన పైలాన్‌ మున్సిపల్‌ అధికారులు దొంగచాటుగా తొలగించడం సరికాదని ఖండించా రు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాల్సిన మున్సిపల్‌ మున్సిపల్‌ కమిషనర్‌, అధికారులు ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అక్రమ కూల్చివేతను ప్రశ్నించిన కోరుకంటి చందర్‌, మూల విజయరెడ్డి, కౌశిక హరి, వ్యాళ్ల హరీశ్‌రెడ్డి, మురళీధర్‌రావు తదితరులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

నిరసన తెలిపిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు

క్రేన్‌ ఆపరేటర్‌ను చితబాదిన మాజీ ఎమ్మెల్యే చందర్‌

అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలింపు

ప్రతిగా ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ దిష్టిబొమ్మ దహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement