పెద్దపల్లి: సోలార్ పవర్ యూనిట్లు మహిళలకు వరం లాంటివని సెర్ప్ సోలార్ విభాగం డైరెక్టర్ కృష్ణ అన్నారు. సోలార్ విద్యుత్ యూనిట్ల ఏర్పాటుపై స్వశక్తి మహిళా సంఘాలకు కలెక్టరేట్‌లో మంగళవారం అవగాహన కల్పించారు. మహిళాశక్తి ద్వారా ప్రతీ జిల్లాలో రెండు మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని, ఆసిఫాబాద్‌లోని యూనిట్‌ను సీఎం ప్రారంభించారని గుర్తుచేశారు. డీఆర్డీవో కాళిందిని మాట్లాడుతూ మంథని మండలంలో ఒక మెగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ యూనిట్ ప్రారంభో త్సవానికి సిద్ధంగా ఉందని అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో మరో మెగావాట్ పవర్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వ విప్ విజయరమణారావు ఇటీవల భూమిపూజ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్‌కో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ మనోహర్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల మండల సమాఖ్య ప్రతినిధులు, పెద్దపల్లి, మంచిర్యాల అదనపు డీఆర్డీవోలు రవీందర్, అంజయ్య, డీపీఎం సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
సెర్ప్ – సోలార్ విభాగం ప్రతినిధి కృష్ణ


