సామాజిక సేవలకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

సామాజిక సేవలకు గుర్తింపు

Nov 2 2026 12:11 AM | Updated on Nov 2 2026 12:11 AM

కోల్‌సిటీ: మహిళల అభ్యున్నతి, సామాజిక సేవే ల క్ష్యంగా సేవలు అందిస్తున్న క్లబ్‌ ఆఫ్‌ రామగుండం మగువ ఉపాధ్యక్షురాలు, గోదావరిఖని సింగరేణి హైస్కూల్‌ టీచర్‌ అట్లూరి శశికళకు అరుదైన గౌర వం దక్కింది. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ‘అవార్డ్‌ ఆఫ్‌ మెరిట్‌’ పురస్కారం వరించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ మల్టిపుల్‌ డిస్ట్రిక్ట్‌–320 అవార్డుల వేడుకలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురితోపాటు శశికళకు అవార్డు ఇచ్చి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement