నడకతోనే ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

నడకతోనే ఆరోగ్యం

Nov 2 2026 12:11 AM | Updated on Nov 2 2026 12:11 AM

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌: నడక, వ్యాయామంతోనే ఆరోగ్యంగా ఉంటామని ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మురళీకృష్ణ, గ వర్నర్‌ సుధాకర్‌రావు అన్నారు. ప్రభుత్వ ఐ టీఐ వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కొ మ్ము జగన్‌, ప్రధాన కార్యదర్శిగా అలుగువెల్లి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడిగా గోపు శ్రీనివాస్‌, ప్ర చార కార్యదర్శిగా వూట్ల అశోక్‌కుమార్‌, కోశాధికారిగా చింతపండు రాజమల్లు, ముఖ్య సలహా దారుగా అన్నేడి వెంటకటరెడ్డి, గౌరవాధ్యక్షుడి గా కొట్టె లక్ష్మయ్య, సలహాదారులుగా వెంకటేశ్వర్‌రావు, సుధాకర్‌, కమల్‌, రాజమౌళి, కొ మురయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడారు. రమణారెడ్డి, రవీందర్‌, జగదీ శ్‌, లక్ష్మయ్య, కొమ్ము సుధాకర్‌, శ్రీపతి సద య్య, నరేందర్‌, ఎలువాక రమేశ్‌ పాల్గొన్నారు.

క్రికెటర్‌ స్ఫూర్తికి సన్మానం

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెంది న స్ఫూర్తి అండర్‌–17 మహిళల జాతీయ స్థా యి క్రికెట్‌ పోటీలకు ఎంపిక కావడంతో శ్రీహనుమాన్‌ అకాడ, స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. జాతీ య స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించా రు. కార్యక్రమంలో అకాడ ఇన్‌చార్జి కంది నాగరాజు, గోలివాడ చంద్రకళ, కంకటి రవి గౌడ్‌, మద్దెల దినేశ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

విద్యార్థుల క్షేత్రసందర్శన

కాల్వశ్రీరాంపూర్‌: ఉషన్నపల్లె ప్రభుత్వ పాఠశా ల విద్యార్థులు ఆదివారం కుండల తయారీని పరిశీలించారు. పోలీసుల పనితీరు, నేరస్తుల పట్టివేత, శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసు లు వివరించారు. బట్టల తయారీ విధానాన్ని చేనేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. సౌ ర విద్యుత్‌ ఉత్పత్తి విధానాన్ని పరిశీలించారు. పాండవుల గుట్ట వేద పాఠశాల, అయ్యప్పస్వా మి ఆలయం, ధాన్యం కొనుగోలు కేంద్రం, హా ర్వెస్టర్‌ ద్వారా పరి కోతలు, పెద్దరాజుపల్లిలోని సమ్మక్క – సారలమ్మ గద్దెలు, మానేరు, మద నం పోచమ్మ ఆలయాన్ని సందర్శించారు. హె చ్‌ఎం సమ్మయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.

మత్తు పదార్థాలు విక్రయించొద్దు

ధర్మారం: తమ గ్రామంలో మత్తు పదార్దాలు విక్రయిస్తే రూ.పదివేల జరిమానా విధిస్తామని కమ్మరిఖాన్‌పేట గ్రామ పంచాయతీ పాలకవ ర్గం తీర్మానించింది. ఆదివారం ఏర్పాటు చేసి న సమావేశంలో మహిళలు మాట్లాడుతూ, గంజాయి, మద్యం, సిగరెట్లతోపాటు ఇతర మత్తు పదార్థాలను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. తీర్మాన కాపీని సర్పంచ్‌ మహేశ్‌కు అందజేశా రు. తీర్మానాన్ని అతికమిస్తే జరిమానా విధిస్తామని, సమాచారం ఇచ్చిన వారికి రూ.రెండు వేల బహుమతి అందిస్తామని నిర్ణయించారు.

ప్రసాదం కౌంటర్‌ ప్రారంభం

కమాన్‌పూర్‌: శ్రీఆదివరాహస్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం కౌంటర్‌ను ఆలయ చైర్మన్‌ ముస్త్యాల దామోదర్‌ ఆదివారం ప్రారంభించా రు. మంథనికి చెందిన పాండ్రాల రాజు రూ.లక్ష11వేల116లను విరాళంగా అందజేయగా కౌంటర్‌ ఏర్పాటు చేశామని చైర్మన్‌ తెలిపారు. డైరెక్టర్లు బూస శ్రీనివాస్‌, పిల్లి రాజు, మల్యాల మల్లేశ్‌, అనవేన శ్యామల, నాయకులు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, రెబల్‌ రాజు, గడ్డం రాజమహేందర్‌, శేవ్వ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

శిక్షణకు సర్పంచుల ఎంపిక

ఓదెల: ఈనెల 2 నుంచి 4 వర కు హైదరాబాద్‌లో జరిగే శిక్ష ణకు ఓదెల మండలం జీల కుంట సర్పంచ్‌ రాగిడి మంగ, సుల్తానాబాద్‌ మండలం మంచిరామి సర్పంచ్‌ ఉప్పు లక్ష్మి ఎంపికయ్యారు. పంచాయతీల నుంచి పార్ల మెంట్‌ వరకు ప్రయాణం, వికసిత్‌భారత్‌, మ హిళా సాధికారత అంశాలపై శిక్షణ ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement