కోల్‌సిటీ: రామగుండం బల్దియాలో చోటుచేసుకు న్న అక్రమాలు అధికారుల మెడకు చుట్టుకుంటు న్నాయి. పారిశుధ్య వాహనాల కొనుగోలు, పాత వాహనాలు, స్క్రాప్ మాయం, హరితహారం పను లు.. ఇలా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ మున్సి పల్ యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజాధనం వినియోగంలో నిబంధనలు పాటించలేదని, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఫిర్యాదులపై ప్రభుత్వం తాజాగా చర్యలకు ఉపక్రమించడం, అధికారులపై విచారణకు ఆదేశించడం బల్దియాలో చర్చనీయాంశంగా మారింది.
స్క్రాప్ మాయంపై మరోసారి చర్చ
పాత మున్సిపల్ కార్యాలయ స్థలంలో పెద్దఎత్తున నిల్వ ఉంచిన ఇనుప సామగ్రి మాయమవడం మరోవివాదానికి దారితీసింది. పాత ట్యాంకర్లు, వీల్‌బార్లు, ట్రాక్టర్ల టెయిలర్లు, ఆటోలు, ఇనుప గాడర్లు, చానళ్లు, పాత భవనం తొలగించిన సమయంలో వచ్చిన సామగ్రి సహా టన్నుల కొద్దీ స్క్రాప్ మాయమైనట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై అందిన ఫిర్యాదులపై పోలీసులు, విజిలెన్స్ అధికారులు విచారణ కూడా చేపట్టారు.
హరితహారంలోనూ అవకతవకలు
ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన హరితహారంపైనా ఫిర్యాదులు వెళ్లాయి. సుమారు రూ.10 కో ట్లతో ఏడు ప్యాకేజీలుగా టెండర్లు నిర్వహించి పను లు చేపట్టినట్లు రికార్డుల్లో చూపించారు. అయితే క్షేత్రస్థాయిలో మొక్కలు నాటకుండానే నాటినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి.
అధికారులపై అభియోగాలు
అప్పటి కమిషనర్లు బి.శ్రీనివాస్, బి.సుమన్‌రావు, డిప్యూటీ కమిషనర్ కె.నారాయణరావు, ఎగ్జిక్యూ టివ్ ఇంజినీర్ బి.మహేందర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు జి.మాధవి, జి.అభినయ్‌కుమార్, అసిస్టెంట్ ఇంజినీర్లు ఎ.ప్రత్యూష, రమాదేవి, జి.తేజస్విని, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం.శ్యామ్‌సుందర్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరితోపాటు హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన ఓ శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఆడిట్ అధికారులపైనా విచారణ జరపడానికి పురపాలక శాఖ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మల్కాజిగిరి బల్దియా అదనపు కమిషనర్ రఘుప్రసాద్‌ను విచారణాధికారిగా నియమించారు.
రామగుండం మున్సిపాలిటీలో భారీగా అవకతవకలు
రస్క్రాప్ మాయం.. వాహనాల కొనుగోళ్లలో గోల్‌మాల్
హరితహారంలోనూ నిధుల దుర్వినియోగమైనట్లు ఆరోపణలు
బిల్లుల చెల్లింపులపై అనుమానాలు.. బాధ్యులపై విచారణ షురూ
వాహనాల కొనుగోళ్లలో గందరగోళం!
నగరంలో పారిశుధ్యం నిర్వహణకు 2020 జూన్ నుంచి 2021 ఏప్రిల్ మధ్య వివిధ రకాల వాహనాలు, యంత్రాలు కొనుగోలు చేశారు. పట్టణ ప్రగతి నుంచి రూ.88 లక్షలు, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.6.25 కోట్లు వెచ్చించి ఇంటింటా చెత్త సేకరణకు 50 స్వచ్ఛ ఆటోలు, ట్రక్ మౌంటెడ్ గార్బేజ్ కాంపాక్టర్లు, 1,100 లీటర్ల సా మర్థ్యం గల కాంపాక్టర్ బిన్లు, రోడ్డు స్వీపింగ్ యంత్రాలు, లిట్టర్ పిక్కర్లు, వైకుంఠ రథాలు, పోర్టబుల్ కాంపాక్టర్లు, ఎక్స్‌కావేటర్, బాబ్‌క్యా ట్, రాడింగ్ యంత్రాలు కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. టీఎస్ ఆగ్రో ఇండస్ట్రీ స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసినట్లు చెబుతున్నా.. ఒప్పందాలు, ఎంబీ రికార్డులు లేకుండానే ఇన్వాయిస్‌ల ఆధారంగా బిల్లు లు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని యంత్రాల జాడ కనిపించడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మార్కెట్ ధరల కంటే 30 నుంచి 40 శాతం అధికంగా చెల్లించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మొత్తమ్మీద రూ.15 కోట్ల మేర బిల్లుల చెల్లింపుల వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.


