పెద్దపలి/పెద్దపల్లిరూరల్: బాలల చట్టాలపై అ వగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్ అన్నారు. రంగంపల్లి మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో బాలల హక్కుల పరిరక్షణ, వేధింపుల నివారణపై శుక్రవారం అవగాహన కల్పించా రు. బాలల సహాయం కోసం 1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాచూరు శ్రీకాంత్, సాంస్కృతిక కార్యదర్శి నరేశ్, న్యాయవాదుల విభాగానికి చెందిన ఝాన్సీ, డీసీపీవో కల్పన తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకత పాటించాలి
పెద్దపల్లి: సన్నబియ్యం ధరల నియంత్రణలో వ్యాపారులు పారదర్శకత పాటించాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు సూచించారు. హోల్‌సేల్ బియ్యం వ్యాపారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. బియ్యం అక్రమంగా నిల్వ చేసినా, కృత్రిమ కొరత సృష్టించినా క ఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, మేనేజ ర్ శ్రీకాంత్, రైస్ మిల్లు యాజమానులు మోరపల్లి తిరుపతిరెడ్డి, చీటి కేశవరావు, ప్రసాద్, ర మేశ్, రామ్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి, దుగ్యాల రా మారావు, వ్యాపారులు పాల్గొన్నారు.
రైల్వే మంత్రితో ఎంపీ భేటీ
రామగుండం: ప్రతిపాదిత రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు, సబ్‌వేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు తదితర ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయా లని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఢిల్లీలో ఎంపీ శుక్రవా రం భేటీ అయ్యారు. ప్రాజెక్టులపై వివరాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. రామగుండం–మణుగూరు రైల్వే ప్రాజెక్టును నిర్మాణ దశలోకి తీసుకెళ్లాలని కోరారు. కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ వెంట ఉన్నారు.
అమరులు.. చిరస్మరణీయులు
సుల్తానాబాద్‌రూరల్: పోలీస్ అమరుల త్యాగా లు వెలకట్టలేనివని డీసీపీ రాంరెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించా రు. డీసీపీ మాట్లాడుతూ, పోలీస్‌లు తమ ప్రా ణాలను పణంగా పెట్టి శాంతిభద్రతల ఏసీపీ కృష్ణ, సీఐ రంజిత్‌రావు, ఎస్సై చంద్రకుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు వల్స నీలయ్య, మాటేటి సంజీవ్, ఎరవెల్లి సుదీర్‌రావు, భూమేశ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలో ఫాగింగ్‌కు బ్రేక్
కోల్‌సిటీ: రామగుండం నగరంలో 15 రోజులు గా ఫాగింగ్ ప్రకియ్ర నిలిచిపోయింది. దోమల బెడద పెరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రెండు ఫా గింగ్ వాహనాలు బల్దియా కార్యాలయలోనే మూలుగుతున్నాయి. రెండునెలల క్రితం మరమ్మతులతో మరోవాహనం మెకానిక్ షెడ్డుకు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫాగింగ్ నిర్వహణపై అధికారులు చెబుతున్న వివరాలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకుండా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఉద్యోగుల పాత్ర కీలకం
జ్యోతినగర్: విధి నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వాములు కావాలని ఎన్టీపీసీ రామగుండం– తె లంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫయాజ్ తయ్యబ్ కాంట్రాక్టు కార్మికులకు సూచించారు. శ్రమ, అంకితభావం కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఎన్టీపీసీ యూనిట్–1 కోల్‌హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ) కోల్‌యార్డులో విధులు ని ర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులను ఆయన శుక్రవారం కలుసుకుని పలు సూచనలు చేశా రు. ఉన్నతాధికారులు, అధికారులు ఉన్నారు.


