క్రీడాకారులకు ప్రభుత్వం అండ | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు ప్రభుత్వం అండ

Oct 31 2026 12:13 AM | Updated on Oct 31 2026 12:13 AM

● ప్రభుత్వ విప్‌ విజయరమణారావు ● ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వాలీబాల్‌ పోటీలు ప్రారంభం

సుల్తానాబాద్‌రూరల్‌: క్రడలకు, క్రీడాకారులకు కాం గ్రెస్‌ సర్కార్‌ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. స్థానిక కళాశాల మైదానంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అండర్‌–17 బాలబాలికల ఎస్‌జీఎఫ్‌ టోర్నమెంట్‌, ఎంపిక పోటీలను శుక్రవారం విప్‌ ప్రారంభించి మాట్లాడా రు. సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన చికిత విలు విద్యలో అంతర్జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణకు పేరు తెవడం గర్వకారణమన్నారు. ఆమెకు సీ ఎం రేవంత్‌రెడ్డి రూ.4కోట్ల నజరానా ప్రకటించారని, క్రీడలు, క్రీడాకారులకు అత్యంత ప్రధాన్యత ఇ వ్వడం ఇందుకు నిదర్శనమన్నారు. అంతకుముందు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రూ.1,40కోట్ల తో నిర్మిస్తున్న భవనం పనుల ప్రగతి పరిశీలించా రు. మున్సిపల్‌ చైర్మన్‌ బిరుదు రాధాకృష్ణ, ఏఎంసీ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ లక్ష్మణ్‌, హెచ్‌ఎం రత్నాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు గాజుల రాయమల్లు, వరప్రదీప్‌, చింతల రాజు, రవీందర్‌, అమిరిశేట్టి శ్రావణిరాకేశ్‌, అబ్బయ్యగౌడ్‌, వాలీబాల్‌ అసో సియేషన్‌ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ గిన్నె లక్ష్మణ్‌, జిల్లా అధ్యక్షుడు రవీందర్‌, యంగ్‌ ఇండియా యూనివర్సిటీ నోడల్‌ ఆఫిసర్‌ శోభరాణి, పేటా అధ్యక్షుడు సురేందర్‌, సెక్రటరీ దాసరి రమేశ్‌, నాయకులు దామోదర్‌రావు, సాయిరి మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆరుతడి పంటలు సాగు చేయాలి

యాజంగిలో ఆరుతడి పంటలు సాగుచేయాలని విప్‌ విజయరమణారావు సూచించారు. చిన్నకల్వ ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిన్నబొంకూర్‌, మియ్యాపూర్‌, రెబ్బల్‌దేవ్‌పల్లిలో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను విప్‌ ప్రా రంభించి మాట్లాడారు. మొక్కజొన్న, పెసరు, బబ్బ ర్లు, పల్లి, ఇతర వాణిజ్య పంటలు సాగు చేయాలని సూచించారు. సింగిల్‌విండో చైర్మన్‌ మురళిధర్‌రా వు, ఏఎంసీ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, సర్పంచులు కవిత, స్రవంతి, పోచాం, సీఈవో రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement