స్వల్పకాలికమే మేలు | - | Sakshi
Sakshi News home page

స్వల్పకాలికమే మేలు

Oct 31 2026 12:13 AM | Updated on Oct 31 2026 12:13 AM

● లేదా బీళ్లుగా ఉంచడమే మంచిది ● నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలు ● ‘సాక్షి’ తో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్‌

పెద్దపల్లిరూరల్‌: ఎల్‌నినో నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు విద్యుత్‌ సరఫరాలో అంతరా యం కలిగే అవకాశాలు ఉంటాయని, యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటవు సాగు చేయడం మేలని, లేదా భూములను పడావుగా ఉంచుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్‌ సూచిస్తున్నారు. జిల్లాలో గత యాసంగి లో 2,17,000 ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈ సీజన్‌లో లక్ష ఎకరాల్లోపే సాగయ్యేలా చూసి మిగతా భూమిలో ఆరుతడి పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని డీఏవో వివరించారు. ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు.

రైతులు వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు కదా?

డీఏవో: వాస్తవమే. ప్రధానంగా రైతులు వరి, పత్తినే సాగు చేస్తారు. ఈసారి ఎల్‌నినోతో భూగర్భజలా లు అడుగంటే పరిస్థితి ఉంది. వరి వైపు దృష్టి సారించొద్దు. పొట్టదశలో పైరుకు ఎక్కువనీరు అవస రమవుతుంది. నీరందకపోతే దిగుబడి రాదు.

ప్రత్యామ్నాయంగా ఎలాంటి పంటలు సాగు చేయాలి?

డీఏవో: నీటి లభ్యతను బట్టి పంటలు వేయాలని సూచిస్తున్నాం. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైన వేరుశనగ, పెసర, పొద్దుతిరుగుడు, శనగలాంటివి వేయాలని అవగాహన కల్పిస్తున్నాం.

జిల్లాలో యాసంగిలో వరి సాగుపై ఎల్‌నినో ప్రభావం ఎలా ఉంటుంది?

డీఏవో: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటే ప్రమాదముంది. గత సీజన్‌లో 2,17, 000 ఎకరాల్లో వరి సాగైతే ఈసీజన్‌లో లక్షలోపు ఎకరాల్లోనే సాగయ్యేలా చూసేందుకు రైతులను చైతన్యపరుస్తున్నాం.

రైతులకు అవగాహన కల్పించారా?

డీఏవో: వరి సాగు చేస్తే దిగుబడి చేతికందే ప రిస్థితి ఉండదని, ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని అవగాహన కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. నవంబర్‌ 2 నుంచి 7వ తేదీ వరకు చై తన్యం కలిగించే కార్యక్రమాలను నిర్వహించనున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement