గౌతమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

గౌతమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

Oct 31 2026 12:13 AM | Updated on Oct 31 2026 12:13 AM

మంథని: పురాతన శ్రీగౌతమేశ్వర ఆలయంలో శుక్రవారం శిఖర కలాపకర్షణ పూజలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ గుండా రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు హాజరయ్యారు. మంథని మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌రెడ్డి, కౌన్సిలర్‌ ఎల్లంకీ వంశీ, కాంగ్రెస్‌ నాయకులు శ్రీరాంబట్ల శీను, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుప్రియ, ఆలయ ఈవో రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల నిరసన

సుల్తానాబాద్‌రూరల్‌: గర్రెపల్లిలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాల ఉపాధ్యాయులు శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. తాము దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ప్రిన్సిపాల్‌ గోల్డి బల్బీర్‌కౌర్‌ మాట్లాడుతూ 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆయన కోరారు. ఐదురోజుల పాటు నిరసన తెలుపుతామని అన్నారు.

కమ్మేసిన పొగమంచు

సుల్తానాబాద్‌రూరల్‌: సుల్తానాబాద్‌ను శుక్రవారం ఉదయం పొగమంచు కమ్మేసింది. వాహనాదారులకు ఎదుటి వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8గంటల వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement