గోదావరిఖని: రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతోనే ఒప్పందాలు ఆలస్యం అవుతున్నాయని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. సింగరేణిలో నిరంతరం జరిగే మెడికల్ బోర్డులో అవకతవకలు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం దాకా బోర్డు నిలిపివేస్తే ఏఐటీయూసీ సమ్మె నోటీసులో మొదటి డిమాండ్ పెట్టి ప్రతి నెలా బోర్డు ఏర్పాటు చేయాలని ఒప్పందం చేసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కోల్‌బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో మెడికల్ బోర్డును ఏరియా హాస్పిటల్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. తక్షణమే మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి 1981 జనవరి ఒప్పందాన్ని అమలు చేసి బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కారుణ్యం కింద డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా యాజమాన్యం డిపెండెంట్లకు నియామక పత్రాలు ఇవ్వాలన్నారు. గుర్తింపు యూనియన్ ఆర్‌ఎల్‌సీ వద్ద చేసుకున్న ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్4న సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. సంస్థకు రావాల్సిన రూ.59వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలన్నారు. నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, బోగ సతీశ్‌బాబు, గండి ప్రసాద్, దొంత సాయన్న, ఎంఏ గౌస్, దాసరి శ్రీనివాస్, అటికేటి రాజు, ఏవీఎస్ ప్రకాశ్, పడాల కనకరాజు, పర్లపెల్లి రామస్వామి, ఎర్రగొల్ల చేరాలు, బూడిద మల్లేశ్, సిర్ర మైసయ్య, జనగామ జగదీశ్వర్, రాపోలు రాజేశ్వరరావు, మోరె సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్జీ వన్ ఓబీసీ ఫిట్ కార్యదర్శులు వీరే..


