ఆరుతడి పంటలు సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు సాగు చేయాలి

Oct 30 2026 12:15 AM | Updated on Oct 30 2026 12:15 AM

రామగిరి: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటి, విద్యుత్‌ సరఫరా తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని మంథని ఏడీఏ అంజని సూచించారు. గురువారం ఆదివారంపేట రైతు వేదికలో నిర్వహించిన ఖేతీ బచావో అభియాన్‌ నేల సంరక్షణ అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. నేల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని, రైతులు సంఘటితంగా ఏర్పడి రైతు ఉత్పత్తిదారుల సంఘాలను స్థాపించడం ద్వారా ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉందన్నారు. కేవీకే శాస్త్రవేత్త నవ్య పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన కల్పించారు. సర్పంచ్‌ ఇల్లందుల సంజీవ్‌, ఏవో చిందం శ్రీకాంత్‌, ఏఈవోలు రమేశ్‌, అరవింద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement