శుచి, రుచికర భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

శుచి, రుచికర భోజనం అందించాలి

Oct 30 2026 12:15 AM | Updated on Oct 30 2026 12:15 AM

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలోని ప్రభుత్వ బీసీ వసతిగృహాల్లో విద్యార్థులకు శుచి, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి రవీందర్‌ అన్నారు. పెద్దపల్లి శివారు రంగంపల్లి బీసీ హాస్టల్‌లో గురువారం జిల్లాలోని హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు, నాల్గోతరగతి సిబ్బంది, వంట సహాయకులకు అవగాహన కల్పించారు. కలెక్టర్‌ శ్రీహర్ష సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, హాస్టల్‌ ఆవరణ అపరిశుభ్రంగా ఉన్నా, భోజనం రుచికరంగా లేకున్నా సంబంధిత అఽధికారులు, సిబ్బందిపై చర్యలు ఉంటాయన్నారు. తాగునీటి ట్యాంకులను ఎప్పటికపుడు శుభ్రం చేయాలని సూచించారు. వంట సిబ్బంది శుభ్రమైన దుస్తులు, ఆఫ్రాన్లు, క్యాప్స్‌ ధరించాలని సూచించారు. హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు రోజూ వంట ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement