కాశీ తరహాలో గోదావరికి సప్త హారతులు | - | Sakshi
Sakshi News home page

కాశీ తరహాలో గోదావరికి సప్త హారతులు

Oct 30 2026 12:15 AM | Updated on Oct 30 2026 12:15 AM

● దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యార్‌

● దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యార్‌

మంథని: జిల్లాలో 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యార్‌ తెలిపారు. గురువారం దేవాదాయ శాఖ డైరెక్టర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ కోయ శ్రీహర్షతో కలిసి మంథని పుష్కర ఘాట్‌ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపల్‌ సెక్రటరీ మీడియాతో మాట్లాడారు. కాశీలో గంగానదికి నిర్వహించే హారతుల తరహాలో మంథనిలోనూ గోదావరినదికి రోజూ సాయంత్రం సప్త హారతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పుష్కరఘాట్‌ పునర్నిర్మాణం, విస్తరణకు రూ.23 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు వివరించారు. మార్చి చివరి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంథనిలోని గౌతమేశ్వరస్వామి ఆలయాన్ని ఆగమశాస్త్ర నిబంధనలు, సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ రూ.10 కోట్లతో పునర్నిర్నాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఓదెల, రామగుండం ప్రాంతాల్లోనూ చిన్న పుష్కరఘాట్లును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలకు 8నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పనుల్లో జాప్యం జరగకుండా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ సబ్‌కమిటీకి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, ఆయన ఆదేశాల మేరకు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్‌ శ్రీరాములు, మంథని ఆర్డీవో సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement