పెరిగిన గృహ విద్యుత్‌ వినియోగం | - | Sakshi
Sakshi News home page

పెరిగిన గృహ విద్యుత్‌ వినియోగం

Oct 27 2026 1:20 AM | Updated on Oct 27 2026 1:20 AM

● 18న రామగుండం సెక్షన్‌లో రికార్డు

రామగుండం: ప్రస్తుతం గృహ విద్యుత్‌ వినియోగం భారీగా పెరుగుతోంది. రామగుండం సర్కిల్‌లో ఈనెల 18న గతేడాదితో పోల్చితే రికార్డుస్థాయిలో 17 వేల యూనిట్లు అధికంగా విద్యుత్‌ వినియోగించినట్లు తేలడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఏసీలు, ఫ్యాన్లు నిరంతరం వినియోగిస్తున్నారు. రామగుండం సెక్షన్‌లో గృహ వినియోగ సర్వీసులు 7,089 ఉండగా, కమర్షియల్‌ సర్వీసులు 1,075, వ్యవసాయ సర్వీసులు 210 ఉన్నాయి.

వాతావరణ పరిస్థితులే కారణం

గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్‌లో విద్యుత్‌ వినియోగం బాగా పెరిగింది. ప్రధానంగా 18వ తేదీన రికార్డుస్థాయిలో 17వేల యూనిట్లు అధికంగా వినియోగించారని నివేదికల్లో నమోదైంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. సబ్‌స్టేషన్‌లో అత్యధిక లోడ్‌ పడి ఉపకరణాలు కాలిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.

– సునీల్‌సాయినాథ్‌రెడ్డి,

ఏఈ, ఎన్పీడీసీఎల్‌, రామగుండం

గతేడాది, ఈఏడాది అక్టోబరులో వినియోగించిన గృహ విద్యుత్‌ (యూనిట్లలో)

తేదీ వినియోగించిన విద్యుత్‌

గతేడాది 18న 52,200

ఈఏడాది 18న 69,200

గతేడాది19న 58,800 64300

గతేడాది 20న 52,000

ఈఏడాది 65,400

గతేడాది 21న 49,700

ఈ ఏడాది 62,700

గతేడాది 22న 56,800

ఈఏడాది 60,200

గతేడాది 23న 50,300

ఈఏడాది 58,560

గతేడాది 24న 49,500

ఈ ఏడాది 59,600

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement