అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి | - | Sakshi
Sakshi News home page

అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

● ఏరియా ఇన్‌చార్జి జీఎం శ్యామ్‌సుందర్‌

భూపాలపల్లి అర్బన్‌: అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతీఒక్కరు కృషి చేయాలని భూపాలపల్లి ఏరియా ఇన్‌చార్జి జీఎం శ్యామ్‌సుందర్‌ కోరారు. భూపాలపల్లి ఏరియా జీఎం కార్యాలయంలో సోమవారం విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. విజిలెన్స్‌ అవగాహన పోస్టర్‌ ఆవిష్కరించి ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. శ్యామ్‌సుందర్‌ మాట్లాడుతూ.. ప్రతీఉద్యోగి విధులను నిజాయతీతో, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. నిబంధనలను పాటిస్తూ సంస్థ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఐఈడీ)జ్యోతి, పర్సనల్‌ మేనేజర్‌ శ్యామ్‌సుందర్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఆఫీసర్‌ పోషమల్లు, ఏఐటీయూసీ నాయకుడు మోటపలుకుల రమేశ్‌, ఐఎన్‌టీయూసీ నాయకుడు బి.మధుకర్‌రెడ్డి, సీఎంవోఏఐ ఏరియా అధ్యక్షుడు నజీర్‌, ఐటీసీ సీనియర్‌ ప్రొగ్రామర్‌ శంకర్‌, జీఎం కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement