సైదాపూర్: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడన్న మనస్తాపంతో ఓ యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. సైదాపూర్ పోలీసులు తెలిపిన వివరాలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన భాషబోయిన సాంబరాజు–మమత దంపతుల కూతురు అఖిల(24) ఇంటర్ పూర్తి చేసి, ఏఎన్‌ఎంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుంది. వారింటి పక్కనే ఉంటూ ట్రాలీఆటో నడుపుకునే కొండపర్తి అక్షయ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెండ్లి చేసుకుందామనుకున్న తర్వాత కొన్నాళ్లకు యువకుడు పెండ్లికి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన అఖిల ఈనెల 24న పురుగుల మందు తాగగా.. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతిచెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలో ఒకరు..
మానకొండూర్: మండలంలోని ఖాదర్‌గూడెం గ్రామానికి చెందిన ఉప్పరి శేఖర్(40) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ శ్రీలత తెలిపిన వివరాలు.. శేఖర్ లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదటి భార్య నాలుగేళ్ల క్రితం మృతిచెందింది. శంకరపట్నం గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలున్న లావణ్యను రెండో వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజుల నుంచి పిల్లల గూర్చి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దసరా సందర్భంగా 15 రోజుల క్రితం లావణ్య పుట్టింటికి వెళ్లింది. లావణ్య మొదటి పిల్లలు రావద్దని భార్యతో శేఖర్ గొడవపడ్డాడు. దీంతో భార్య కాపురానికి రావట్లేదని మనస్తాపంతో మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానాకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అనారోగ్యంతో వృద్ధురాలు..
ఇల్లంతకుంట: అనారోగ్యానికి గురై ఆస్పత్రుల చుట్టూ తిరిగినా వ్యాధి నయం కాకపోవడంతో మనస్థాపానకి గురైన వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేటకు చెందిన దాడి దేవేంద్ర(75) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పతుల్లో చూపించుకుంటుంది. వ్యాధి నయం కాకపోవడంతో ఇంట్లో సోమవారం ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగింది. మృతురాలి కొడుకు రమణ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు.
దుమాలలో మూడిళ్లలో చోరీ
ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో దొంగలు ఆదివా రం రాత్రి మూడిళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన కదిరే లక్ష్మణ్‌గౌడ్, సల్మాల బాలలక్ష్మి, సల్మాల రాజేందర్ కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల వద్దకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు అర్ధరాత్రి మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. లక్ష్మణ్‌గౌడ్ ఇంట్లో రూ.లక్ష నగదు, 16 తులాల వెండి, సల్మాల బాలలక్ష్మి ఇంట్లో రూ.10వేలు ఎత్తుకెళ్లారు. పోలీసులు క్లూస్ టీమ్ సభ్యులతో వేలిముద్రలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌లతో గాలింపు చేపట్టారు.


