● రైల్వే ట్రాక్‌పై ఒకేరోజు ఇద్దరు ఆత్మహత్య ● ఇంట్లో నుంచి వెళ్లిపోయి అఘాయిత్యం ● మల్యాల మండలంలో ఘటన
మల్యాల: మద్యానికి బానిసై ఒకరు.. కుటుంబ కలహాలతో మరొకరు ఇంట్లో నుంచి వెళ్లిపోయి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్యాల మండలంలో చోటుచేసుకుంది. మల్యాల మండలం ముత్యంపేట శివారు కొండగట్టు వద్ద ఒకరు, పోతారం శివారు వద్ద రైల్వేట్రాక్‌పై మృతదేహాలు కనిపించాయి. మంచిర్యాల రైల్వే ఎస్సై టి.సుధాకర్, హెడ్‌కానిస్టేబుల్ తిరుపతి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని గణేశ్ నగర్‌కు చెందిన సంగె కరుణాకర్(49)కు ముగ్గురు కూతుళ్లు. కుటుంబ కలహాలతో ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం కొండగట్టు వద్ద రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. రైలు కరుణాకర్ శరీరంపై నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జు అయింది. మల్యాల మండలం నూకపల్లికి చెందిన రెడ్డిమళ్ల రమేశ్(38) మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది రైల్వేట్రాక్‌పైకి చేరుకున్నాడు. గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో కాళ్లు తెగిపోయాయి. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారివారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలకు స్పందన
కరీంనగర్‌స్పోర్ట్స్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన అండర్– 19 జూనియర్స్ బాలికల హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది క్రీడాకారిణులు పాల్గొని ప్రతిభ ప్రదర్శించారు. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా ఉమ్మడి జిల్లా జట్టుకు నిర్వాహకులు ఎంపిక చేశారు. ఈ నెల 31 నుంచి నవంబర్ 2 వరకు ఖమ్మంలో నిర్వహించే రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో జిల్లా జట్టు పాల్గొననున్నట్లు ఉమ్మడి జిల్లా కార్యదర్శి బసరవేణి లక్ష్మణ్ తెలిపారు. మాస్టర్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్ నీలం లక్ష్మణ్, కోచ్‌లు వెంకటేశ్, ప్రభాకర్, పీఈటీలు అమరేందర్, శివాజీ, సాయి, విజయ్, సంపూర్ణ, విజయ్, సీనియర్ క్రీడాకారులు రమేశ్, జయంత్ తదితరులు పాల్గొన్నారు.


