గోదావరిఖని: పారదర్శకత, నిజాయతీతో పనిచేసి సింగరేణి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఆర్జీ–2 జీఎం లక్ష్మీపతిగౌడ్ కోరారు. ఆర్జీ–2లో సోమవారం విజిలెన్స్ వారోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. కంపెనీ నష్టాలను నివారించి లాభాల బాటలో కొనసాగడానికి అవినీతిని అరికట్టడం ప్రతీఒక్కరి బాధ్యతన్నారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా, కొనుగోళ్లు, కాంట్రాక్ట్ పనుల్లో పారదర్శకత పాటించాలని, ఎక్కడైనా అవినీతి చోటుచేసుకుంటే నిర్భయంగా విజిలెన్స్ విభాగానికి సమాచారం ఇవ్వాలని కోరారు. ఎస్‌వోటూ జీఎం రాముడు, అధికార ప్రతినిధి వేణుగోపాల్, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్జీన్ ఏరియాలో..
ఆర్జీ–1 ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్ విజిలెన్స్ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి అభివృద్ధి కోసం అవినీతిని రూపుమాపాలని కోరారు. ఈసందర్భంగా అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అధికారులు ఇజ్జగిరి రాజు, క్రాంతి, విశ్వేశ్వర్‌రావు, ధనలక్ష్మీబాయి, తిరుపతి, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.


