ఆత్మహత్యకు అనుమతించండి | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు అనుమతించండి

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

జగిత్యాలటౌన్‌: తమ భాగస్వాముల ఇబ్బందులు భరించలేకపోతున్నానని, తమకు ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని మెట్‌పల్లి పట్టణానికి చెందిన మ్యాడం గోవర్దన్‌ అనే వ్యక్తి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ సత్యప్రసాద్‌ను కోరారు. మెట్‌పల్లిలో వెల్లుల రోడ్‌లో ఉన్న ఖాదీ ప్రతిష్టాన్‌ కాంప్లెక్స్‌లో తన పేరిట ఉన్న గదిలో మరో ముగ్గురి భాగస్వామ్యంతో మెడికల్‌ స్టోర్‌ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ముగిసినప్పటికీ ఖాళీ చేయకుండా తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఆత్మహత్య శరణ్యమని, ఇందుకు తనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

జిన్నింగ్‌ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీ

జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని 9 జిన్నింగ్‌ మిల్లుల్లో వే బ్రిడ్జిలను జిల్లా లీగల్‌ మెట్రాలాజీ అధికారి అజీజ్‌ పాషా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లక్ష్మి కాటన్‌, మురుగన్‌, వైభవ్‌, సిందు, సీతారామ కాటన్‌ మిల్లుల్లో తూకం వేసే బాట్లను అందుబాటులో ఉంచుకోవాల్సి ఉందన్నారు. బాట్లు లేనందున వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పూల్లూరి స్వప్నసదానందం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement