కోల్సిటీ: వాతావరణ మార్పులతో అనారోగ్య స మస్యలు తలెత్తి గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి బారులు తీరుతున్నారు. రోజూ ఔట్ పేషెంట్ల సంఖ్య సుమారు 1,400 దాటుతోంది.
మారుతున్న వాతావరణం
కొద్దిరోజులుగా వాతావరణంలో చోటుచేసుకుంటు న్న మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పు లు, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి తదితర సమస్యలతో ఆస్పత్రికి వస్తున్నారు. సోమవారం 1,415 మంది, ఈనెల 24న 1,333 మంది, 23న 1,412 మంది చికిత్స పొందారు.
14 రోజులుగా ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె
డిమాండ్ల సాధన కోసం ఎన్హెచ్ఎం ఉద్యోగులు, సిబ్బంది కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మె 14 రోజులుగా కొనసాగుతోంది. గోదావరిఖనిలోని ఆరోగ్య కేంద్రాల ఉద్యోగులు, సిబ్బంది సైతం ఇందులో పా ల్గొంటున్నారు. దీంతో ఆయా వైద్య సేవలకు అంత రాయం ఏర్పడి, చికిత్స కోసం వచ్చే పేషెంట్లు ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు జీజీహెచ్ కు వస్తుండటంతో రద్దీ మరింత పెరుగుతోంది.
తప్పని ఇబ్బందులు
జీజీహెచ్లో పెరుగుతున్న ఓపీ నేపథ్యంలో సకాలంలో వైద్యం అందడం కీలకంగా మారింది. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.


