పెద్దపల్లిరూరల్: ఎల్‌నినో ప్రభావం.. వర్షాభా వంతో కరువు తరుముకొస్తున్న వేళ రైతులకు ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యా చరణకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ‘ఖే త్ బచావో అభియాన్’ (భూసార, సాగు సంర క్షణ ఉద్యమం) పేరిట ఈనెల 22న ప్రత్యేక కా ర్యక్రమం ప్రారంభించనుంది. నవంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. గ్రామాల్లోని ప్రతీరైతుకు ఆధునిక సాగు పద్ధతులు, కరువును త ట్టుకునే పంటల యాజమాన్యంపై అవగాహన కల్పించాలన్నదే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమ ని జిల్లా అధికారులు చెబుతున్నారు.
ఎల్‌నినోను ఎదుర్కొనేలా..
ప్రస్తుత వానాకాలం సీజన్లో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో సాగులో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని వచ్చే యాసంగిలో అనుసరించాల్సిన పద్ధతులపై ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నారు. పంటల పరిస్థితిని క్షేత్రస్థాయిలో అంచనా వేయడం, ఎండిపోతున్న సాగు భూములను కాపాడుకోవడం అత్యంత అవసరంగా మారింది. ఇందుకోసం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా నేరుగా రైతుల ముంగిటకే శాస్త్రవేత్తలను తీసుకెళ్లేలా ఈ ‘ఖేత్ బచా వో’ కార్యక్రమం రూపుదిద్దుకున్నట్టు జిల్లా వ్య వసాయ శాఖ అధికారుల ద్వారా తెలిసింది.
రైతులకు శాస్త్రవేత్తల సలహా సూచనలు
పల్లెల్లో ఖేత్ బచావో అభియాన్ ద్వారా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వ్యవసాయ పరిశోధనాకేంద్రాలు, వ్యవసాయ అనుబంధ సంస్థల శాస్త్రవేత్తలు, నిపుణులతో రైతులకు అవగాహ న కల్పిస్తారు. గ్రామాల్లో పర్యటించి ముఖా ముఖి సమావేశాలు నిర్వహించి సందేహాలను నివృత్తి చేస్తారు. ఎల్‌నినోతో ఏర్పడే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రత్యామ్నా య పంటలు వేయాలి? అందుబాటులో ఉన్న నీటివనరులను ఎలా పొదుపుగా వాడుకోవాలి? భూసారాన్ని కాపాడుకుంటూ తక్కువ పె ట్టుబడితో అధిక దిగుబడి ఎలా సాధించాలనే అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమం అన్నదాతలకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు.
కార్యాచరణ రూపొందిస్తున్నాం
కేంద్రప్రభుత్వం ఈనెల 22 నుంచి నవంబర్ 30 దాకా నిర్వహించే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని జిల్లాలో గ్రామాల వారీగా అమ లు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. జిల్లాలోని 14 మండలాల పరిధిలో 263 పంచాయతీల్లో రైతులకు యాసంగి సీజన్లో అనుసరించాల్సిన పద్ధతుల గురించి విపులంగా వివరించి ఆర్థికంగా నష్టపోకుండా అవగాహన కల్పిస్తాం.
– శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి


