పెద్దపల్లిరూరల్: నియోజకవర్గ పరిధిలోని పల్లెలను ప్రణాళికాబద్ధంగా పట్టణశోభ సంతరించుకునేలా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మె ల్యే చింతకుంట విజయరమణారావు అ న్నారు. రాఘవాపూర్ గ్రామ శివారు గొల్లపల్లిలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు అభివృద్ధి పనులను సోమవారం ప్రభుత్వ విప్ ప్రారంభించి మా ట్లాడారు. అంతర్గత రహదారులను సీసీ రోడ్లు గా అభివృద్ధి చేసే పనులు పురోగతిలో ఉన్నాయని అ న్నారు. పల్లె ప్రజలకు కనీస వసతులు కల్పించేందు కు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంట రమేశ్, మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేశం, నాయకుడు సందనవేన రాజేందర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.


