ముందస్తు సంబురం | - | Sakshi
Sakshi News home page

ముందస్తు సంబురం

Oct 20 2026 12:02 AM | Updated on Oct 20 2026 12:02 AM

గోదావరిఖని: స్థానిక సింగరేణి జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో సోమవారం రాత్రి ముందస్తు దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ నేతృత్వం వహించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. సినీ కళాకారుడు శివారెడ్డి ఆధ్వర్యంలో జబర్దస్త్‌ టీం, సినీ కళాకారులు ప్రదర్శనలతో సభికులను ఉర్రూతలూగించారు. క్రాకర్స్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రావణ దహనంతో వేడుకలు ముగిశాయి. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్‌, పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా, మేయర్‌ మహంకాళి స్వామి, సింగరేణి జీఎంలు లలిత్‌కుమార్‌, లక్ష్మీపతిగౌడ్‌, సేవా అధ్యక్షురాలు అనిత, యూనియన్‌ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, తుమ్మల రాజారెడ్డి, మడ్డి ఎల్లయ్య, కార్మిక, కార్మికేతర కుటుంబాలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement