విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలి

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

ఎలిగేడు: రైతులు పంటలు పండిస్తూనే విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం పెద్దపల్లి కో ఆర్డినేటర్‌, శాస్త్రవేత్త ఓదెల సంపత్‌ సూచించారు. నాబార్డు, వ్యవసాయ విశ్వ వి ద్యాలయం, నాణ్యమైన విత్తనం ప్రాథమిక సహకా ర సంఘాల ద్వారా విత్తన ఉత్పత్తి చేయడం కోసం స్థానిక సహకార సంఘం కార్యాలయంలో రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. నర్సాపూర్‌ గ్రా మానికి చెందిన తంగెళ్ల సతీశ్‌ సాగు చేసిన కేఎన్‌ఎం–1638 రకం బ్రీడర్‌ సీడ్‌ను వరి పంట పరిశీలించా రు. ఆ రైతు పండించిన ధాన్యాన్ని సహకార సంఘం కొనుగోలు చేసి అవే విత్తనాలను రైతులకు అందిస్తుందని సహకార సంఘం చైర్మన్‌ సామ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సహకార సంఘం డైరెక్టర్లు అ మ్ముల రమేశ్‌ యాదవ్‌, నరహరి మోహన్‌రెడ్డి, స ర్పంచులు ఏలేటివెంకట్‌రెడ్డి, పల్లెర్ల వెంకటేశ్‌గౌడ్‌, సంఘం కార్యదర్శి కేశెట్టి విక్రమ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement