పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

● జిల్లాలో 5.14 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా ● కౌలు రైతులు, ఎన్‌డీఎస్‌ సాగుదారులకూ మద్దతు ధర ● కప్పాస్‌ కిసాన్‌ యాప్‌పై అన్నదాతలకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు

పెద్దపల్లి: పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించడంతోపాటు దళారుల బారిన పడకుండా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈసారి 51,400 ఎకరాల్లో పత్తి సాగు చేయగా సుమారు 5.14 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. నవంబర్‌, డిసెంబర్‌ల్లో అధికంగా పత్తి దిగుబడి వచ్చే అవకాశముండటంతో కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి మండలంలో రెండు, సుల్తానాబాద్‌, కమాన్‌పూర్‌ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

కొనుగోళ్లపై కలెక్టర్‌ సమీక్ష

పత్తి కొనుగోళ్లపై ఇటీవల కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సమీక్షించారు. మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర లభిస్తే రైతులు నష్టపోకుండా సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశించా రు. జిన్నింగ్‌ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

నాణ్యతా ప్రమాణాలపై అవగాహన

రైతువేదికల్లో ఏఈవోలు రైతులకు అవగాహన క ల్పించి పత్తి నాణ్యతా ప్రమాణాలు, అనుమతించిన తేమశాతం, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల వివరాలను తెలియజేయాలని సూచించారు. పత్తిని పూ ర్తిగా ఆరబెట్టి, శుభ్రం చేశాకే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, నాసిరకం పత్తిని కలపకుండా చూడాలన్నారు. కప్పాస్‌ కిసాన్‌ యాప్‌లో నమోదు, కొనుగోలు కేంద్రాల ఎంపిక, స్లాట్‌ బుకింగ్‌ విధానంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

కౌలు రైతులకూ మద్దతు ధర

సాఫ్ట్‌వేర్‌లో నిర్దేశించిన సగటు దిగుబడి కంటే వా స్తవ దిగుబడి ఎక్కువగా ఉన్నా.. రైతులకు అన్యా యం జరగకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టా లని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సాగు విస్తీర్ణం, పంట పరిస్థితిని పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు న్యాయం చేయాలన్నారు. భూమి రికార్డు ల సమస్యలతో కౌలు రైతులు, నాన్‌ డిజిటల్లీ సైన్డ్‌ (ఎన్‌డీఎస్‌) భూముల సాగుదారులు మద్దతు ధర ప్రయోజనాలు కోల్పోకుండా నమోదు, ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు.

కేంద్రాల్లో మౌలిక వసతులు

కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తేమ కొలిచే యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ అధి కారులను ఆదేశించారు. విద్యుత్‌ సరఫరా, అగ్నిప్రమాదాల నివారణకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని, పత్తి విక్రయించిన అనంతరం సకాలంలో చెల్లింపులు జరి గేలా సీసీఐ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర అందేలా చూడాలని స్పష్టం చేశారు.

ఏర్పాట్లు చేస్తున్నాం

జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సుమారు 51,400 ఎకరా ల్లో పత్తి సాగు చేయగా, 5.14 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేస్తున్నాం. క్వింటాల్‌కు రూ.8,267 నుంచి రూ.8,667 మద్దతు ధర ఉంది. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు చేయాలి. దళారులను నమ్మి మోసపోవద్దు.

– ప్రవీణ్‌రెడ్డి, డీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement