గోదావరిఖని: అటవీ అధికారులు, సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, డీఎఫ్వో రాహుల్ జాదవ్, పెద్దపల్లి డీఎఫ్వో కృష్ణగౌడ్, ఏసీపీలతో కలిసి అటవీ అధికారులకు భద్రత, అటవీ భూముల పరిరక్షణ, ప్రజలతో అటవీ సిబ్బంది సమన్వయం తదితర అంశాలపై శుక్రవారం తన కార్యాలయంలో సమీక్షించారు. అటవీ చట్టాలు, నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. మొక్కల పెంపకం, అటవీ సరిహద్దుల నిర్ధారణ, ఆక్రమణల నుంచి విముక్తి కల్పించిన రిజర్వ్ ఫారెస్ట్ భూముల పరిరక్షణ వంటి కార్యక్రమాల నిర్వహణలో అటవీ సిబ్బందికి పోలీసు బందోబస్తు కల్పించాలని అధికారులకు సూచించారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, మంచిర్యాల, జైపూర్, బెల్లంపల్లి ఏసీపీలు రమేశ్, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, కిరణ్కుమార్, సీసీఆర్బీ, స్పెషల్ బ్రాంచ్, మంచిర్యాలటౌన్, లక్సెట్టిపేట, చెన్నూర్ రూరల్ సీఐలు గోపీ, శ్రీనివాస్, ప్రమోద్రావు, రమణమూర్తి, కృష్ణ, సర్వేశ్వర్, డీసీఎఫ్జీ రాంమూర్తి, ఎఫ్డీవోలు రామమోహన్, విజయ్కుమార్ పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా


