గోదావరిఖని: సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు విస్మరించి, రెచ్చగొట్టేలా మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెల్లంపల్లి, మంచిర్యాల, శ్రీరాంపూర్ నుంచి ప్రజలను తీసుకొచ్చి రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే అవకాశం కల్పించినందుకు కేటీఆర్కు ధన్యవాదాలని తెలిపారు. కార్మికులకు 34 శాతం లాభాల వాటా, మారుపేర్ల సమస్య పరిష్కారం, సొంతింటి కల వేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనమన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన కాసోజు శ్రీకాంతాచారి గుర్తుకు రాలేదు కానీ.. ప్యారడైజ్ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ముస్తాఫా, నాయకులు బొంతల రాజేశ్, మారెల్లి రాజిరెడ్డి పాల్గొన్నారు.
జీడీకే–2ఏ గనిపై ప్రత్యేక పూజలు
దేవీశరన్నవరాత్రోత్సవాల సందర్భంగా సింగరేణి ఆర్జీ–వన్ ఏరియాలోని జీడీకే–2,2ఏ, 5,5ఏగనులు తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు, అధికారులు, నాయకులు తదితరులు ఆయనను సన్మానించారు.
రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్


