పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: పంటలను కాపాడేందుకే ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయించామని ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు. చందపల్లి ప్రధాన కాలువ వద్ద డీ–83, 86 కాల్వల ద్వారా సరఫరా అవుతున్న నీటిని శుక్రవారం పరిశీలించారు. సుల్తానాబాద్లోని దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో ఆరో వార్డులో కౌన్సిలర్ బాకం సాయికిర ణ్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. పెద్దపల్లిలో లబ్ధి దారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో విప్ మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో సాగునీటి కొరత ఏర్ప డే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రధానంగా రైతులు తమ వద్ద ఉన్న సాగునీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్న పంట సాగు చేయడమే మేలని ఆయన అన్నారు. మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, తహసీల్దార్ రాజన్న, సింగిల్విండో చైర్మన్ నరేశ్, సుల్తానాబాద్ కౌన్సిలర్లు వరప్రదీప్, గాజుల రాయమల్లు, టికే ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు అమిరిశెట్టి తిరుపతి, రవీందర్, శ్యాంసుందర్, ఆరేపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ విజయరమణారావు


