పోలీసుల దృష్టి మళ్లించి.. | - | Sakshi
Sakshi News home page

పోలీసుల దృష్టి మళ్లించి..

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలో బీజేపీ మంగళవా రం చేపట్టిన నిరసన పోలీసులు, ఆందోళనకారు లతో హైడ్రామాను తలపించింది. కాంగ్రెస్‌ ఆధ్వ ర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరసనకు కౌంటర్‌గా బీజేపీ నేతలు మంగళవారం రాజీవ్‌ రహదారిపై ఆందోళన చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేయవద్దని పోలీసులు వారించగా.. ఎలాగైనా దహనం చేయాలని నాయకులు వ్యూహం ప న్నారు. కమాన్‌వద్ద నిరసన వ్యక్తం చేసి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా.. పోలీసులు భ గ్నం చేశారు. అదేసమయంలో సమీపంలోని కూనా రం చౌరస్తా వద్ద మరో దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా చేరుకున్న పోలీసులు అడ్డుకునేందుకు య త్నించేలోపే నిప్పంటుకుంది. ఆ బొమ్మతో బీజేపీ నే త రోడ్డుపై పరుగులు తీశారు. వెనకాల పోలీసులు పరుగులు తీయడం హైడ్రామాను తలపించింది. అయితే, ప్రజలకు అసౌకర్యం కల్పించిన విషయమై కేసు నమోదు చేసినట్టు ఎస్సై నరేశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement