డ్రగ్స్‌పై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌పై ఉక్కుపాదం

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

కోల్‌సిటీ: యువత డ్రగ్స్‌, గంజాయి వంటి మా దకద్రవ్యాలకు బానిస కాకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు ఆదేశించా రు. రామగుండంలోని డీ–అడిక్షన్‌ కేంద్రం, ప్ర భుత్వ జనరల్‌ ఆస్పత్రిని మంగళవారం తనిఖీ చేశారు. మాదకద్రవ్యాల బారినపడిన వారికి అందుతున్న వైద్యం, కౌన్సెలింగ్‌, పునరావాస సేవలు, సౌకర్యాలపై ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ హిమబిందుసింగ్‌ను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, తల్లిదండ్రులు, యు వత సమన్వయంతో పనిచేస్తే మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఆర్‌ఎంవో కృపాభాయి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రవివర్మ, తహసీల్దార్‌ రవీందర్‌రావు, ఆర్‌ఐ రాజేందర్‌, సీడీపీవో అలేఖ్య, సీ–సెక్షన్‌ సూపరింటెండెంట్‌ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

ఆర్థికాభివృద్ధి సాధించాలి

కమాన్‌పూర్‌: స్వశక్తి సంఘాల్లోని సభ్యులు వ్యా పారాభివృద్ధికి బాటలు వేసుకోవాలని డీఆర్డీవో కాళిందిని సూచించారు. స్థానిక ఆదివరాహ స్వామి మహాళా స్వశక్తి సంఘ భవనంలో మంగళవారం కమాన్‌పూర్‌, రామగిరి, ముత్తారం, మంథని, పాలకుర్తి, అంతర్గాం మండలాల ఏ పీఎంలు, సీసీలుతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఒక్కో మహిళకు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీపీఎం వెంకటరమణ, ఏపీఎంలు పద్మ, రమ, స్వరూప, రాణి పాల్గొన్నారు.

ముగిసిన ఎస్జీఎఫ్‌ క్రీడలు

పెద్దపల్లి: సుల్తానాబాద్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ సహకారంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్‌ పోటీలు మంగళవారం ముగిశాయి. మున్సిప ల్‌ చైర్మన్‌ బిరుదు రాధాకృష్ణ విజేతలకు బహుమతులు అందజేశారు. ఎస్జీఎఫ్‌ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్‌, స్పోర్ట్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ముస్త్యా ల రవీందర్‌, నోడల్‌ ఆఫీసర్‌ శోభారాణి, జోనల్‌ కన్వీనర్‌ దాసరి రమేశ్‌, మండల కన్వీనర్‌ ప్రణయ్‌ తదితరులు పాల్గొన్నారు.

లోకో పైలెట్ల నిరసన

రామగుండం: హక్కులు, భద్రత, సంక్షేమం, మెరుగైన పనితదితర తదితర డిమాండ్ల సాధ న కోసం దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ రామగుండం బ్రాంచి చైర్మన్‌ మెట్ట రా మారావు ఆధ్వర్యంలో స్థానిక రైల్వేస్టేషన్‌లో లోకోపైలెట్లు మంగళవారం నిరసన తెలిపారు. ఎఫ్‌వోజీ డివైజెస్‌, టేల్‌ ల్యాంప్స్‌ తీసుకువెళ్లే బాధ్యతను ఉపసంహరించాలని, లోకో, ట్రాఫి క్‌ రన్నింగ్‌ స్టాఫ్‌ పని గంటలను పది గంటలకు పరిమితం చేయాలనే తదితర సమస్యలు పరిష్కరించాలని రామారావు డిమాండ్‌చేశారు. ప్రతినిధులు ఓవై స్వామి, మెజెస్‌, బినోద్‌, రాథోడ్‌ ఆనంద్‌, శ్రీనివాస్‌, సురేందర్‌, రవీందర్‌, రఫీ తదితరులు పాల్గొన్నారు.

నందిమేడారంలో జ్వరాలు

ధర్మారం: నందిమేడారం ఎస్సీ కాలనీలో జ్వరాలు విజృంభించాయి 30 పడకల ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోనే ఉన్నా జ్వర పీడితులకు వైద్యం అందించడంలేదని, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించక తప్పడంలేదని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నా రు. అయినా పీహెచ్‌సీ సిబ్బంది పట్టించుకోవ డంలేదని వాపోతున్నారు. కొందరు మంచాని కే పరిమితమవుతున్నారు, ఆర్థిక స్థోమతలేని వారు ఆర్‌ఎంపీలతో చికిత్స చేయించుకుంటున్నారు. మరికొందరు ధర్మారం, కరీంనగర్‌, పె ద్దపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైరల్‌ జ్వరాలు విస్తరిస్తున్నా వైద్యాధికారి, ఏఎన్‌ఎంలు పట్టించుకోవటం లేదని బొంతల నర్సింగం ఆరోపించారు. ఆరోగ్యశాఖాధి కారులు స్పందించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement