పెద్దపల్లి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రోడ్డు భద్రత, ప్రమాణాల అమలు, తీసుకోవాల్సిన చర్యలపై అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్షించారు. పెద్దపల్లిలోని జంక్షన్ల వద్ద ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేయాలని, సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద యూటర్న్ ఏర్పాటు చేయాలని, రోడ్లపై పశువులను వదిలే వారిపై రూ.10 వేల జరిమానా విధించాలని ఆదేశించారు. రామగుండంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని చెప్పారు. ఆర్ అండ్ బీ ఈఈ భావ్‌సింగ్, జిల్లా వైద్యాధికారి పవిత్ర తదితరులు పాల్గొన్నారు.
30లోగా సర్వే పూర్తిచేయాలి
జిల్లాలో పంటల డిజిటల్ సర్వేను ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సర్వేపై వ్యవసాయాధికారులతో కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


