గ్యాస్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌

Sep 28 2026 7:39 AM | Updated on Sep 28 2026 7:39 AM

మంథనిరూరల్‌: వంటగ్యాస్‌(ఎల్‌పీజీ) వినియోగదారులకు ఊరట లభించింది. సిలిండర్‌ బుకింగ్‌ను 45రోజుల నుంచి 25రోజులకు కుదిస్తూ కేంద్ర ప్ర భుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేయడంతో కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 14 ఏజె న్సీల్లో హెచ్‌పీ, భారత్‌, ఇండేన్‌ ఆయిల్‌ కంపెనీలకు చెందిన కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో కమర్షియల్‌ 79,046, డొమెస్టిక్‌ కనెక్షన్లు 88,892 ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టణ పరిధిలో 21 రోజులు, గ్రామాల్లో 45 రోజులకోసారి గ్యాస్‌సిలిండర్‌ బుక్‌ చేసుకునేలా ఉన్న నిబంధనలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీఅయ్యాయి.

సింగిల్‌ సిలిండర్‌తో ఇబ్బందులు

జిల్లాలో అనేకమంది సింగిల్‌సిలిండర్‌ వినియోగదారులు ఉన్నారు. ఒక సిలిండర్‌ బుక్‌ చేశాక రెండు లేదా మూడు రోజుల్లోనే డెలివరీ అయ్యేది. అయితే 45 రోజుల కాలవ్యవధి ఉండటంతో ఒక్కోసారి సిలిండర్‌ నెలపది రోజులకే ఖాళీ అవడంతో ఇబ్బందులు తప్పలేదు. శుభకార్యాలు, వంటలు అధికంగా చేయాల్సి వస్తే మరో సిలిండర్‌ కోసం విని యోగదారులు నానాతంటాలు పడాల్సి వచ్చేది.

పశ్చిమాసియా యుద్ధంతో..

కొద్దినెలల క్రితం పశ్చిమాసియా యుద్ధ వాతావరణంతో ఇంధన రవాణాకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. గ్యాస్‌ సరఫరా లేక సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద కస్టమర్లు బారులు తీరారు.

25 రోజులకే బుక్‌ చేసుకోవచ్చు

గతంలో గ్యాస్‌ బుకింగ్‌కు 45 రోజుల గడువు ఉండేది. ప్రభుత్వం తాజాగా 25 రోజులకే బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. మంథని ఏజెన్సీ పరిధిలో ప్రతీరోజు 250 వరకు సిలిండర్లు డెలివరీ చేస్తున్నాం. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– ఎల్లంకి వాసుదేవ్‌, మేనేజర్‌,

సాయి కిషన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, మంథని

45 నుంచి 25 రోజులకు బుకింగ్‌ సమయం తగ్గింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement