రామగిరి: నిరక్షరాస్యులపై మహిళల జీవితాల్లో చ దువుల వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చేపట్టిన అమ్మకు ‘అక్షరమాల’ ఆదివారం నిర్వహించారు. వి విధ గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఈ సంద ర్భంగా నిర్వహించిన ఉల్లాస్ పరీక్షకు 1,990 మంది మహిళలు పరీక్షకు హాజరయ్యారు. చదవడం, రా యడం నేర్చుకోవాలనే ఉత్సాహంతో మహిళలు ప రీక్ష రాశారు. చదువుతో ఆర్థికంగా స్వావలంబన సా ధించడంతోపాటు తమ సంఘాల పుస్తకాలను తా మే చదివి, రాసుకునేలా కార్యక్రమాన్ని అమలు చే స్తున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షలకు హాజరై న మహిళలకు సర్పంచులు ప్రశ్నాపత్రాలు, పెన్ను లు పంపిణీ చేశారు. ఏపీఎం పద్మ మాట్లాడుతూ, ప్రతీ మహిళకు చదవడం, రాయడం రావాలన్నదే అమ్మకు అక్షరమాల లక్ష్యమన్నారు. చదువుతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.


