ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ | - | Sakshi
Sakshi News home page

ఆడబిడ్డలకు ప్రభుత్వం అండ

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

పెద్దపల్లి: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడ మే సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ లక్ష్యమని ప్రభుత్వ వి ప్‌ విజయరమణారావు అన్నారు. స్థానిక రంగంపల్లి ఆర్‌ఆర్‌ గార్డెన్స్‌లో శనివారం మహిళలకు ఇందిర మ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ల క్ష్యమన్నారు. రూ.5 కోట్లతో జిల్లా కేంద్రంలో ఇంది రా మహిళా శక్తి భవనం నిర్మించామని, త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పెద్దపల్లి ని యోజకవర్గంలోని 367 మందికి రూ.1.65 కోట్ల వి లువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశా రు. 91 మందికి రూ.91.10 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేశారు. జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు అన్నయగౌడ్‌, మున్సి పల్‌ చైర్మన్‌ నూగిల్ల మల్లయ్య, కమిషనర్‌ వెంకటేశ్‌, సింగిల్‌విండో చైర్మన్లు నరేశ్‌, శ్రీగిరి శ్రీనివాస్‌, కల్లేపల్లి జానీ, చిలుక సతీశ్‌, భాస్కర్‌రెడ్డి, సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్‌ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement