ఆలిండియా స్థాయి రెస్క్యూ జట్లు ఇవే.. | - | Sakshi
Sakshi News home page

ఆలిండియా స్థాయి రెస్క్యూ జట్లు ఇవే..

Sep 26 2026 12:38 AM | Updated on Sep 26 2026 12:38 AM

గోదావరిఖని: ఆలిండియా 55వ, మైన్స్‌ రెస్క్యూ పోటీలకు ఎంపికూన సభ్యులను యాజమాన్యం శుక్రవారం ప్రకటించింది. ఈనెల 23, 24వ తేదీల్లో ఇంటర్‌ ఏరియా రెస్క్యూ పోటీలు నిర్వహించగా, ప్రతిభ కనబర్చిన సభ్యులను ఆలిండియా రెస్క్యూ పోటీలకు ఎంపిక చేశారు. ఆలిండియా రెస్క్యూ పోటీల్లో సింగరేణి తరఫున రెండు పురుష, ఒక మహిళా జట్టు పాల్గొంటుండగా, ఒక్కో జట్టు నుంచి 8మంది సభ్యులుగా ఉంటారు. వీరంతా ఝార్షండ్‌లోని రాంచీలో జనవరిలో జరిగే ఆలిండియా రెస్క్యూ పాల్గొనున్నారు.

సింగరేణి టీం – ఏ సభ్యులు..

పురుషుల టీం –ఏ జట్టు కెప్టెన్‌గా జీడీకే–2గనికి చెందిన సీనియర్‌ అండర్‌ మేనేజర్‌ బి.నితిన్‌కుమార్‌, ఏఎల్‌పీ గని ఎంజీటీ టి.శ్రీకాంత్‌, జీడీకే–11గని జేఎంఈడీ ఎ.శ్యాంకుమార్‌, ఆర్కే న్యూటెక్‌ సీనియర్‌ మైనింగ్‌ సర్దార్‌ బి.సాంబశివుడు, కాసిపేట–2గనికి చెందిన సీనియర్‌ మైనింగ్‌ సర్దార్‌ కె.రమేశ్‌, ఏఎల్‌పీ గనికి చెందిన సీనియర్‌ మైనింగ్‌ సర్దార్‌ బి.తిరుపతి, రామకృష్ణాపూర్‌ సీహెచ్‌పీకి చెందిన ఫోర్‌మెన్‌ ఎం.శ్రాణ్‌కుమార్‌, ఐందారం –1ఏ గనికి చెందిన జనరల్‌ అసిస్టెంట్‌ జి.సదాశివకుమార్‌ ఎంపికయ్యారు.

పురుషులు టీం –బీ సభ్యులు వీరే

కేటీకే–5గనికి చెందిన సీనియర్‌ అండర్‌ మేనేజర్‌ జి.ప్రమోద్‌కుమార్‌, పీవీకే–5గనికి డిప్యూటీ మేనేజర్‌ కె.శ్రావణ్‌కుమార్‌, ఏఎల్‌పీ గని జనరల్‌ అసిస్టెంట్‌ సీహెచ్‌ శ్రీవిఘ్నన్‌, ఏఎల్‌పీ గనికి చెందిన సీనియర్‌ మైనింగ్‌ సర్దార్‌ ఎస్‌కే ముదాసిర్‌అలీ, కేటీకే–5గని షార్ట్‌ఫైరర్‌ ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి, జీడీకే–1,3 గని సీనియర్‌ మైనింగ్‌ సర్దార్‌ బి.సాయివర్ధన్‌, పీకే ఓసీ జనరల్‌ అసిస్టెంట్‌ పి.జలపతి, ఆర్కే న్యూటెక్‌ షార్ట్‌ఫైరర్‌ జె.వెంకటేశ్‌ ఎంపికయ్యారు. అలాగే స్టాండ్‌ బైగా ఏఎల్‌గని కన్వేయర్‌ ఆపరేటర్‌ ఎ.శివకుమార్‌, వకీల్‌పల్లిగని జనరల్‌ అసిస్టెంట్‌ సీహెచ్‌ సతీశ్‌కుమార్‌, కేటీకే–1 గని షార్ట్‌ఫైరర్‌ ఎం.రాకేశ్‌ను ఎంపిక చేశారు.

మహిళా జట్టు సభ్యులు వీరే..

పీవీసకే–5 గనికి చెందిన సీనియర్‌ అండర్‌మేనేజర్‌ వి.కృష్ణవేణి(కెప్టెన్‌), సీనియర్‌ అండర్‌ మేనేజర్‌ ఎ.మౌనిక, సీనియర్‌ అండర్‌ మేనేజర్‌ బి.చందనజవేరీ, ఆర్‌కే–7గని జెఎంఈటీ ఇ.సురక్ష, జేఎంఈటీ వి.సాయిఅక్షయ, వకీల్‌పల్లిగని సీనియర్‌ అండర్‌మేనేజర్‌ ఎన్‌.రక్షిత, ఆర్కే–7గని ఎం.లిఖిత, పీవీకే–5గని సీనియర్‌ అండర్‌మేనేజర్‌ సీహెచ్‌ గాయత్రి ఎంపిక కాగా స్టాండ్‌ బైగా వకీల్‌గనికి చెందిన సీనియర్‌ మైనింగ్‌ సర్దార్‌ ఎస్‌కే ఆషియాబేగం, సీనియర్‌ మైనింగ్‌ సర్దార్‌ బి.జీవన్మయి, ఆర్కే–7గని సీనియర్‌ మైనింగ్‌ సర్దార్‌ ఎం.సాయి ప్రత్యూష ఎంపికై నట్లు ప్రకటించారు.

సింగరేణి నుంచి ఎంపికైన రెండు పురుష, ఒక మహిళా జట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement