రైతుల అభిప్రాయాలు సేకరించాకే భూసేకరణ | - | Sakshi
Sakshi News home page

రైతుల అభిప్రాయాలు సేకరించాకే భూసేకరణ

Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM

● కలెక్టర్‌ కోయశ్రీహర్ష

రామగిరి: రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలు, అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నాకే సింగరేణి భూసేకరణపై తుది నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ఉప్పట్ల కేసారం, రాజాపూర్‌ గ్రామాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. ఉప్పట్లకేసారంలో సర్వే నంబర్‌ 35 లోని ప్రభుత్వ భూమి పరిశీలించారు. రాజాపూర్‌లో అదనపు కలెక్టర్‌ శ్రీరాములుతో కలిసి నిర్వాసితుల సమస్యలు, అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. డీసీపీ రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేశ్‌, తహసీల్దార్‌ సుమన్‌, రాజాపూర్‌ సర్పంచ్‌ పుల్లెల భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్‌ కలవేన శ్రీకాంత్‌, సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా డిజిటల్‌ పశు సంపద మిషన్‌

పెద్దపల్లి: డిజిటల్‌ పశుసంపద మిషన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్‌లో పశుసంవర్థక శాఖ అధికారులతో ఆగస్టు 18న నుంచి కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులపై సమీక్షించారు. భారత్‌ పశుధన్‌ పోర్టల్‌ ద్వారా ప్రతీపశువుకు 12 అంకెల బార్‌కోడ్‌ ఏర్పాటు చేసి, యజమాని ఆధార్‌, మొబైల్‌ నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. పశుసంవర్థక శాఖ అధికారి వేణుగోపాల్‌రావు, ఇన్‌చార్జి డీపీవో శ్రీమాల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement