గోదావరిఖని: ఆర్టీ–2లోని మెయిన్ రెస్క్యూ స్టేషన్‌లో బుధ, గురువారాల్లో సింగరేణిస్థాయి జోనల్ మైన్స్ రెస్క్యూ పోటీలు నిర్వహింనున్నారు. సింగరేణిలోని 6 పురుష, 2 మహిళా జట్లు, హట్టీ గోల్డ్‌మైన్స్, యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోపాటు మొత్తం 10 రెస్క్యూ జట్లు పోటీలకు హాజ రవుతాయి. పోటీల కోసం మెయిన్ రెస్క్యూ స్టేషన్ ను అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన సభ్యులను ఈఏడాది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.
అన్నిఏర్పాట్లు చేశాం
55వ జోనల్‌స్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలకు ఏర్పాట్లు చేశామని రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జట్లు ఇప్పటికే చేరుకున్నాయని, భారీవర్షాలు కురిసినా అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్జీ–2 జీఎం లక్ష్మీపతిగౌడ్, రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి, ఎస్‌వోటూ జీఎం రాముడు, పర్సనల్ హెచ్‌వోడీ వేణుగోపాల్, డీవైపీఎం సునీల్‌ప్రసాద్ ఉన్నారు.


