గోదావరిఖనిలోని ప్రముఖ బేకరీలో బ్రెడ్ కొన్న. తయారీ, గడువు తేదీ, కంపెనీ పేరులేవు. మరుసటిరోజు తినడానికి చూస్తే సిల్వర్ కవర్ ముక్కలు కనిపించాయి. మరోప్రముఖ స్వీట్‌హౌస్‌లో బూందీ కొంటే స్క్రూ వచ్చింది. నిలదీస్తే సింపుల్‌గా సారీ చెప్పి తప్పించుకున్నారు. ప్రతీ షాప్ ముందు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, టోల్‌ఫ్రీ నంబర్లు ప్రదర్శించి నిఘా ఉంచాలి.
– పిట్టల రాజ్‌కుమార్, మదర్ హ్యూమన్ యూత్ సొసైటీ
కల్తీ ఆహారంతో ముప్పు
కల్తీ ఆహారంతో వెంటనే కనిపించే సమస్యలు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, వికారం, జ్వరం. కలుషితం లేదా నాసిరకం ఆహారాన్ని దీర్ఘకాలం తీసుకుంటే అవయవాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రసాయనాలు, రంగులు కలిపిన ఆహారాన్ని పదేపదే తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇలాంటివాటికి ప్రజలు దూరంగా ఉండాలి.
– డాక్టర్ అజయ్, అసిస్టెంట్ ఫొఫెసర్


