● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: ప్రజావాణి అర్జీలకు అత్యంత ప్రా ధాన్యంతో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీరాములుతో కలిసి సోమ వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించా రు. గోదావరిఖనిలోని మేదారి లలిత.. తన కుమార్తె పేరిట ఉన్న ఇంటిని రిజిరస్ట్రేషన్ చేసుకొని తమ బాగోలు చూడకుండా ఇంటినుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నరని ఫిర్యాదు చేశారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు కలెక్టర్ సూచించారు. ఫిర్యాదులు రావడంతో తక్షణమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు.
23న ఆయుర్వేద వైద్యశిబిరం
ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 23న జిల్లా ఆస్పత్రిలో నిర్వహించే మెగా ఆయుర్వేద వైద్యశిబిరాన్ని సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూ చించారు. ఉచిత మెగా వైద్య శిబిరం ప్రచార పోస్టర్‌ను తన కార్యాలయంలో కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయుష్ జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ అరుణ, సీనియర్ వైద్యాధికారి శోభరాణి, వైద్యాధికారులు అమర్‌నాథ్, మారుతి, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ విద్యసాగర్ తదితరులు ఉన్నారు.
గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం ప్రదర్శించకుండా నిత్యం క్షేత్రస్థాయిలో ప ర్యవేక్షించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారుల ను ఆదేశించారు. ఎంపీవోలు, డీఎల్‌పీవోల తో పారిశుధ్యం నిర్వహణపై కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించి పలు సూచనలు చేశారు.


