జీవో 76పై కాంగ్రెస్‌ డ్రామాలు | - | Sakshi
Sakshi News home page

జీవో 76పై కాంగ్రెస్‌ డ్రామాలు

Sep 22 2026 12:24 AM | Updated on Sep 22 2026 12:24 AM

గోదావరిఖని: జీవో 76పై కాంగ్రెస్‌ డ్రామాలు చేస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధ్వజమెత్తారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి మాట్లాడారు. సింగరేణి స్థలాలను రెగ్యులరైజ్‌ చేసే ప్రక్రియలో అప్పటి సీఎం కేసీఆర్‌ జీవో 76 తీసుకొచ్చారని, దీనిద్వారా దాదాపు 2వేల ఎకరాల సింగరేణి స్థలాల్లో పట్టాలు జారీచేశారని గుర్తుచేశారు. ఆ జీవోలోని కొన్ని లోటుపాట్లను సవరిస్తూ 2023లో కేసీఆర్‌ జీవో 28 కూడా జారీచేశారని, జీవో 76ను కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తూ సింగరేణి స్థలాలు క్రమబద్ధీకరిస్తామని గొప్పలు చెప్పుకుంటోందని కొప్పుల ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో నాయకులు వ్యాళ్ల హరీశ్‌రెడ్డి, మేకల సమ్మయ్యయాదవ్‌, నూనె కొమురయ్య, మూల విజయారెడ్డి, మురళీధర్‌రావు, మారుతి, బొడ్డు రవీందర్‌, పర్లపల్లి రవి, పోలాడి శ్రీనివాస్‌రావు, దండే రవి, నూతి తిరుపతి, మెతుకు దేవరాజ్‌, అచ్చే వేణు తదితరులు పాల్గొన్నారు.

పోలీసు అధికారితో విచారణ

మంథని: తనపై సోషల్‌ మీడియా, పత్రికల ద్వారా తప్పుడు, పరువునష్టం కలిగించే ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని మంథనికి చెందిన నాయిని సంతోష్‌ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై మంథని పోలీసులు, రామగుండం పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీనియర్‌ పోలీస్‌ అధికారితో విచారణ జరిపించాలని ఫిర్యాదారు సంతోష్‌ కోరారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన హక్కుల కమిషన్‌ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement